నవతెలంగాణ – సూర్యాపేట
మలిదశ తెలంగాణ ఉద్యమ అమరవీరుడు కొండేటి వేణుగోపాల్ రెడ్డి స్ఫూర్తితో తెలంగాణ సమగ్ర అభివృద్ధికి పాటుబడదామని తెలంగాణ జన సమితి అధ్యక్షులు, శాసనమండ సభ్యులు, ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. కొండేటి వేణుగోపాల్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ విద్యార్థి యువజన సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని వేణుగోపాల్ రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది అమరవీరుల బలిదానాల ఫలితంగా ప్రజా పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. గత పది సంవత్సరాల కాలంలో అమరవీరుల త్యాగాలను కెసిఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. వాళ్ళకి తగిన గౌరవం గుర్తింపు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల ఆశయ సాధన కోసం ముందుకు కొనసాగుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్, బైరి రమేష్, బొడ్డు శంకర్, జాటోత్ శీను, కో ల్లు కృష్ణారెడ్డి ,వినయ్ గౌడ్, సూర్యనారాయణ,ఏనుగు మధుసూదన్, యాకోబు రెడ్డి ,సతీష్, ఫరీదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.