– ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్
– ఘనంగా 138 మేడే వేడుకలు
నవతెలంగాణ-ఆసిఫాబాద్
కార్మిక చట్టాల పునరుద్ధరణకై మే డే స్ఫూర్తితో కార్మికులు ఐక్యంగా పోరాటానికి సిద్ధమై బీజేపీని ఓడించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్, సీపీఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ అన్నారు. 138వ మేడే సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జెండాను బోగే ఉపేందర్, సీపీఐ జెండాను భద్రి సత్యనారాయణ, ఆర్టీసీ జెండాను దివాకర్, బూరుగుడాలో పిడుగు శంకర్, మార్కెట్ హమాలి జెండాను సుధాకర్, సివిల్ సప్లయి హమాలి జెండాను బి.సుధాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని, నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల పునరుద్ధరణకై దేశంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని బ్యాంకులను కుదించారదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి చిరంజీవి, నాయకులు శ్రీనివాస్, ప్రకాష్, మోహన్, కొమురక్క పాల్గొన్నారు.
సిర్పూర్(టి): ప్రపంచవ్యాప్తంగా కార్మికుల బానిస సంకెళ్లు తెగిపోయిన రోజు మేడే దినోత్సవం ప్రత్యేకతాని భవన నిర్మాణ సంఘం ప్రధాన కార్యదర్శి శివరాం అన్నారు. బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక విప్లవం నుండి కార్మికుల శ్రమ దోపిడిని యజమానులు దోచుకున్నారని, దీనికి నిరసనగా ప్రపంచవ్యాప్తంగా కార్మికుల సంక్షేమం కోసం అనేక ఉద్యమాలు చేసి కార్మికుల శ్రమతో పాటు పని దినాలను తగ్గించుకున్నారన్నారు. దీనిని స్పూర్తిగా తీసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులకు వ్యతిరేకంగా చేస్తున్న చట్టాలను ప్రతి ఒక్కరు ప్రతిఘటించి హక్కులను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల గౌరవధ్యక్షుడు చింతల సత్తయ్య, ఎంపీపీ ఈర్త సత్యనారాయణ, సాయిరె రమేష్, ప్రభాకర్, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
దహెగాం: మండల కేంద్రంలో బుధవారం మేడే వేడుకలను సీఐటీయూ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా కార్మికులు ర్యాలీ నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీటీయూ మండల ప్రధాన కార్యదర్శి రమేష్, కోకన్వీనర్ వజ్రమ్మ మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పోరాడాలన్నారు. మేడేను స్పూర్తిగా తీసుకొని అందరు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు జయప్రద, నాయకులు రాజ్‌కుమార్, అరుణ్‌గౌడ్, రవీందర్, మారుతి, మమత, కల్పన, రాజేశ్వరి, భాగ్యలక్ష్మి, హేమలత పాల్గొన్నారు.
వాంకిడి: మేడే దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని బుధవారం మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ముందు హమాలీ సంఘం అధ్యక్షుడు విలాస్ జెండాను ఆవిష్కరించారు. భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ప్రక్కన గల స్థలంలో భవన నిర్మాణ సంఘం మండల అధ్యక్షుడు రవి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల అధ్యక్షురాలు విమలాబాయి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి కార్మికులకు కార్యాలయం లేకపోవడంతో రోడ్డు ప్రక్కనే సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాన్ని సంఘం భవనానికి అందరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్నులే నారాయణ, సింగిల్‌విండో చైర్మన్ జాబిరె పెంటు, డీఎఫ్‌ఐ అధ్యక్షుడు మౌల్కార్ అశోక్, హమాలీ సంఘం కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
పెంచికల్‌పేట్: మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు బషీర్‌ఖాన్ సీఐటీయూ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరు ఏకతాటిపై ఉండి పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ప్రేమల, రజియాబేగం పాల్గొన్నారు.
చింతలమానేపల్లి: మండల కేంద్రం లోని గ్రామపంచాయితీ కార్యాలయంలో ముందు ‘మే” డే సందర్భరంగా సీఐటీయూ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం సీఐటీయూ మండల కన్వీనర్ విలాస్ మాట్లాడుతూ కనీస వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు టి.రవి, అశవర్కర్ల మండల అధ్యక్షురాలు బండి అనురాధ, లక్ష్మి, అర్పన, మధ్యాహ్న భోజన కార్మికురాలు విమల, కామల, అంగన్‌వాడీలు కళావళి, గ్రామపంచాయతీ కార్మికులు శంరావు, వెంకటి, ప్రమీల పాల్గొన్నారు.
కౌటాల: మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో మేడే వేడుకలను పురస్కరించుకొని మండల ప్రధాన కార్యదర్శి మోర్లె నాగేష్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల మేడే పోరాట స్పూర్తితో పెట్టుబడిదారుల, పాలకవర్గాల దోపిడి దాడులు అణచివేతలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడి హక్కులు సాధించుకుంటూ వర్గ ఐక్యతను కాపాడుతున్న ప్రజలకు సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేను జరుపుకోవడం జరిగిందన్నారు.