
– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపు
నవతెలంగాణ – భువనగిరి
మేడే స్ఫూర్తితో మతోన్మాద బీజేపీని దేశంలో అధికారంలో రాకుండా ఓడించి కార్మిక చట్టాలను, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో మేడే సందర్భంగా జిల్లా కార్యాలయ భవనంపై జెండాను నర్సింహ ఎగురవేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నర్సింహ పాల్గొని మాట్లాడుతూ ..కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతం పేరుతో కులం పేరుతో మనుషుల మధ్య ఐక్యతను చీల్చి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్ర చేస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ బడా కార్పొరేట్ శక్తులకు ఎర్ర తివాచీ వేసి ప్రభుత్వ రంగ సంస్థలలోకి ఆహ్వానించి కార్మికుల పొట్ట గొట్టాలనే కుట్ర బీజేపీ చేస్తుందని విమర్శించారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లు తెచ్చి కార్మిక హక్కులను కాలరాస్తూ ఎనిమిది గంటల పది దినాన్ని 12 గంటలుగా మార్చాలని పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మికుల వ్యతిరేకంగా బీజేపీ ప్రవర్తిస్తున్నారన్నారు. మతం పేరుతో, కులం పేరుతో, దేవాలయాల పేరుతో ఓట్లను దండుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని, ఈ నేపథ్యంలో 138వ మేడే స్ఫూర్తితో మతోన్మాద బీజేపీని ఎన్నికల్లో ఓడించి, నిరంతరం ప్రజల పక్షాన, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కోసం పోరాటం చేస్తానన్న సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ గారికి ఓటు వేసి గెలిపించాలని మేడే స్ఫూర్తిని ప్రజలకు తెలిసే విధంగా అమరుల ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని వారు అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల, పేద మధ్యతరగతి ప్రజల మీద దాడులు పెరిగి ప్రజల మీద అనేక భారాలు మోపే ప్రయత్నం బీజేపీ చేస్తుందని మహిళా రక్షణ కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మేడే సందర్భంగా అమరుల పోరాట స్ఫూర్తితో మతోన్మాద బీజేపీని ఓడించి ఎర్రజెండాను గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు మాయ కృష్ణ , గడ్డం వెంకటేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి వనం రాజు, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంటపాక శివ, ఈర్లపల్లి ముత్యాలు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, సీపీఐ(ఎం) మండల పట్టణ నాయకులు పల్లెర్ల అంజయ్య, గంధమల్ల మాతయ్య, బందెల ఎల్లయ్య, అంజయ్య, నరేష్, ఉదయ్, పాల్గొన్నారు. హనుమాన్ వాడలో భువనగిరి సీపీఐ(ఎం) శాఖా కార్యదర్శి బర్ల వెంకటేశం ఎర్రజెండను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొలుపుల వివేకానంద, వడ్డే కృష్ణ, పల్లెర్ల గంగయ్య, నరాల నరసింహ పాల్గొన్నారు.
సమ సమాజం కోసం పోరాడుదాం: సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు పిలుపు
ఈరోజు జిల్లా కేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయం ముందు అరుణపతాకాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు ఎగురవేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం ఆవరణలో అరుణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల కోసం 18 గంటల పని దినాన్ని తగ్గించాలని అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు ఎనిమిది గంటల పని దినాన్ని అమలుపరచాలని వీరోచిత పోరాటాలు నిర్వహించారు వేలాది మంది కార్మికులు ఆ పోరాటంలో ప్రాణాలర్పించారన్నారు. మత రాజకీయాలకు దూరంగా ప్రజలను చైతన్య పరచాలని మత రాజకీయాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు సమాయత్తం కావాలని మేడే సందర్భంగా పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు సోమన సబిత ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వస్తువుల అభిలాష్ సీపీఐ పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య మండల కార్యవర్గ సభ్యులు చొప్పరి సత్తయ్య పాల్గొన్నారు.