భువనగిరి మండలంలోని బండ సోమవారం గ్రామంలో అండర్ పాస్ సాధన కమిటీ ఆధ్వర్యంలో అండర్పాస్ సాధన గ్రామ కమిటీ అధ్యక్షులుగా మజ్జిగ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సిలివేరు అశోక్ ఎన్నుకున్నట్లు వండర్ పాస్ సాధన కమిటీ కన్వీనర్ సిల్వర్ ఎల్లయ్య, కో కన్వీనర్ కంచి మల్లయ్య, మందడి సిద్ధారెడ్డిలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముట్టడి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిలివేరు మధు, అశోక్, కాటం శంకర్ రెడ్డి, బలరాం, కుమార్, బాల్రాజ్ , జంగయ్య, పాండు, కృష్ణ, నాయుడు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.