– సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ-కొత్తగూడెం
రాక్షస పాలనను అంతం చేద్దామని సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. కొత్తగూడెంలో ప్రజాపాలన కోసం కంకి కొడవలి గుర్తుకు ఓటువేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం నామినేషన్ వేసిన సందర్భంగా లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డులో జరిగిన సభలో వారు మాట్లాడుతూ.. కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలు స్వేచ్ఛగా జీవించే పరిస్థితి లేదని, అధికార యంత్రాంగం చట్టబద్దంగా పనిచేసే పరిస్థితి లేదని, ఇందుకు కారణం వనమా కుటుంబమే అని విమర్శించారు. ఇక్కడ వనమా కుటుంబం, అక్కడ కల్వకుంట్ల కుటుంబం ప్రజలను దోచుకుతింటు న్నాయని ఆరోపించారు. తెలంగాణ సాధన కోసం సీపీఐ బహుముఖ పోరాటాలు నిర్వహించిందని చవెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకులు బాగం హేమంతరావు పాల్గొన్నారు.