క్రిస్మస్‌ రుచులు ఆరోగ్యంగా ఆస్వాదిద్దాం

క్రిస్మస్‌… ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పవిత్రమైన పండగ. క్రీస్తు జన్మదినం సందర్భంగా ఆనందం, శాంతి, ప్రేమ, కరుణను అందించే దినంగా ఈ పండుగను జరుపుకుంటారు. క్రిస్మస్‌ వేడుకల్లో ఆహారపదార్థాలు కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తాయి.
డిన్నర్‌ : క్రిస్మస్‌ డిన్నర్‌ అత్యంత ముఖ్యమైనది. ఇందులో భాగంగా పిండి, మాంసం, బిర్యానీలు, కేకులు,పాస్తాలు, సూప్‌ వంటి వంటకాలు తినడం సహజం.
కేక్స్‌, మాంసాహారం : క్రిస్మస్‌ వేడుకల్లో కేక్స్‌, మాంసాహారం కచ్చితంగా ఉంటాయి. ఇవి రుచికరంగా ఉండటంతో పాటు, పండగ అనుభూతిని మరింత ఉత్సాహంగా మార్చుతాయి. అయితే ఇవి అధిక కొవ్వు, చక్కెర, ప్రాసెసింగ్‌ చేసిన పదార్థాలు. కనుక ఆరోగ్యానికి హానికరం కవొచ్చు. కాబట్టి మనం ఆరోగ్యానికి హానిచేయని కేక్స్‌, మాంసాహారాన్ని ఎంచుకోవడం చాలా అవసరం.
కేక్స్‌ తీసుకోవడంలో..
క్రిస్మస్‌ అంటే ముందుగా గుర్తుకు వచ్చేవి కేక్స్‌. అయితే అవి అధిక చక్కెర, కొవ్వుతో తయారవుతాయి. ఇది ఆరోగ్యానికి నష్టం చేయవచ్చు. కనుక కేక్స్‌ను సరైన మోతాదులో తీసుకోవడం అవసరం.
పరిమితి : కేక్‌ను ఇష్టపడని వారంటూ ఉండరు. కానీ పరిమితంగా తీసుకోవడం ముఖ్యం.
ఎంపిక: ఆరోగ్యకరమైన కేకులను ఎంపిక చేసుకోవచ్చు. చక్కెర, గ్లూటెన్‌ లేకుండా తక్కువ కొవ్వుతో తయారు చేసినవి, పండ్లతో తయారు చేసిన కేకులను ఎంచుకోవడం ఆరోగ్యానికి మంచిది.
పరిమిత చక్కెర: కేక్స్‌లో ఉండే చక్కెర స్థాయిని నియంత్రించడం చాలా ముఖ్యం. షుగర్‌ ఫ్రీ లేదా తక్కువ చక్కెరతో తయారైన కేక్స్‌ను ఎంచుకోవడం ఆరోగ్యానికి మంచిది. అవి హానికరమైన షుగర్‌, అధిక క్యాలరీల నుండి మనకు రక్షణ కలిగిస్తాయి.
పండ్లతో : కేక్స్‌లో ఫలాలు (అరటిపళ్లు, బేరీలు, ఆపిల్స్‌) జోడించడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా మనకు అందిస్తాయి.
మాంసాహారం తీసుకోవడంలో..
క్రిస్మస్‌లో మాంసాహారం కూడా ముఖ్యమైన వంటకం. టర్కీ, హామ్‌, చికెన్‌, బీఫ్‌ వంటి మాంసాలు పండగ సందర్భంగా చాలా ప్రాచుర్యం పొందుతాయి. అయితే అధిక కొవ్వు, ప్రాసెస్డ్‌ మాంసాలు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి మాంసాహారాన్ని సమర్థవంతంగా ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలి.
సమర్థవంతం అంటే..?
బాయిల్లింగ్‌ లేదా బేకింగ్‌ : మాంసాన్ని వేపకుండా బాయిల్‌ చేయడం లేదా బేక్‌ చేయడం ఆరోగ్యకరమైన ఎంపిక. ఉడకబెట్టడం వల్ల మాంసంలో ఉన్న అదనపు కొవ్వును తగ్గుతుంది. మనం ఆరోగ్యకరమైన మాంసాన్ని ఆస్వాదించడానికి వీలవుతుంది.
కొవ్వు : మాంసం తీసుకునేటప్పుడు అత్యధిక కొవ్వు ఉన్న భాగాలను తీసివేయాలి. ఉదా: బకన్‌, ఆఫల్‌ (లోవర్‌ అబ్డ్‌ మినల్‌ మీట్‌)
మాంసంతో ఆకుకూరలు : మాంసాహారంతో పాటు ఆకుకూరలు, కూరగాయలు, పప్పు వంటి ఆహారాలను జత చేస్తే సమతుల్యమైన పోషకాలు అందుతాయి. అంతేకాకుండా ఇవి మాంసంలో ఆరోగ్యకరమైన పౌష్టిక విలువను పెంచుతాయి.
ఉదా : గోంగూర చికెన్‌, చింతచిగురు మాంసం, మేతి మటన్‌ కూర, బచ్చలి ఆకుతో చికెన్‌, పాలకూర చికెన్‌
ప్రాసెసింగ్‌ ఆహారం : మాంసాహారాన్ని బాగా ప్రాసెస్‌ చేయడం, అధిక సోయా సాస్‌, చాట్‌, చెర్రీ టమాటో సాస్‌ వంటి వాటితో చేయడం ఆరోగ్యనికి మంచిది కాదు. అందువల్ల వీటిని కొంచెం తక్కువగా ఉపయోగించడం ఉత్తమం.
పానీయాలు : ఎక్కువ చక్కెర, కొవ్వు కలిగిన పానీయాలను తగ్గించి తేలికపాటి జ్యూస్‌, మజ్జిగ వంటి ఆరోగ్యకరమైన పానీయాలను ఎంచుకోండి.
ముగింపు
క్రిస్మస్‌ పండగ అంటే మన కుటుంబంతో గడిపే అత్యంత ఆనందకరమైన సమయం. అయితే ఇందులో ఆరోగ్యకరమైన ఆహారం వాడటం మరువకూడదు. పిల్లలు, పెద్దలు ఇద్దరూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఈ పండగ కాలాన్ని ఇంకా ఆనందంగా, ఆరోగ్యంగా గడపవచ్చు.
Dr.Prathusha. Nerella
MD( General Medicine) CCEBDM; CCGDM; NLP; FID
Senior General Physician, Positive Psychologist certified Nutritionist, Diabetes And Lifestyle Expert, Pranic Healer Chiief Holistic Health Consultant And Medical Director @ Praveha General, Diabetes And Lifestyle Clinic – A Holistic Centre With Integrated Approach. Ph: 8897684912/040-49950314