పోలియో రహిత సమాజాన్ని స్థాపిద్దాం: తహసీల్దార్ ఆంజనేయులు

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
పల్స్ పోలియో చుక్కలు వేయించడం ద్వారా చిన్నారులను పోలియో మహమ్మారి నుండి సంరక్షిద్దామని కమ్మర్ పల్లి తహసిల్దార్ ఆంజనేయులు అన్నారు. ఆదివారం మండలంలోని అన్ని గ్రామాల్లోని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమాలను నిర్వహించారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమాన్ని తహసిల్దార్ ఆంజనేయులు  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించడం ద్వారా వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేయవచ్చు అన్నారు. పోలియో చుక్కలు చంటిబిడ్డ రోగనిరోధక శక్తిని పెంచే సంజీవని అని తెలిపారు. ఐదు సంవత్సరాల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని స్థాపిద్దామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు మైలారం సుధాకర్, మండల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరసింహ, ఆయా గ్రామాల్లో ఏఎన్ఎంలు, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.