మనువాద ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడుదాం  

– ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం
– తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా సమన్వయకర్త మల్లా గౌడ్
– తెలంగాణ ప్రజా ఫ్రంట్  కరపత్రాల ఆవిష్కరణ 
నవతెలంగాణ – జమ్మికుంట 
మనువాద పాసి జానికి వ్యతిరేకంగా పోరాడుదాం అని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదామని తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా సమన్వయకర్త ఆరెల్లి  మల్లా గౌడ్  అన్నారు. శనివారం మండల కేంద్రంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడారు. దేశంలో మోడీ ప్రభుత్వం అత్యంత పాసిస్టు పాలన కొనసాగిస్తూ ప్రజల మధ్య అంతరాలు సృష్టించిందని  విమర్శించారు. దేశ సంపదను అంతా కొద్దిమంది కార్పొరేట్ శక్తుల్లో కేంద్రీకరించే విధంగా మోడీ ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడోసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని సైతం మారుస్తామని బాహాటంగానే బిజెపి నేతలు చెప్తున్న దుస్థితి ఉండడం దురదృష్టకరమన్నారు. బిజెపి మూడోసారి అధికారంలోకి వస్తే పేద ప్రజల మనుగడ కష్టం, స్వేచ్ఛ వాతావరణం లేకుండా మనువాదం ముసుగులో మరింత అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు రాబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు . మోడీ ప్రభుత్వానికి అడ్డుకట్ట వేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన బాధ్యత భారత దేశ ప్రగతిశీల శక్తులపై ఉందని  పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ,మోడీ ప్రభుత్వం కొనసాగిస్తున్న అరాచకాలను, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజలను మరింతగా చైతన్యవంతులను చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈనెల 28న  ఆదివారం సమయం మధ్యాహ్నం రెండు గంటల నుండి  సుందరయ్య విజ్ఞాన కేంద్రం, భాగ్లింగంపల్లి, హైద్రాబాద్ లో మనువాద ఫాసిజానికి వ్యతిరేకంగా జరిగే సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీపతి కృష్ణ, విజయ్, మల్లారెడ్డి, అంజి తదితరులు పాల్గొన్నారు.