అంతరాలు లేని సమాజం కోసం పోరాడుదాం

– సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏ.వెంకటస్వామి
నవ తెలంగాణ – జోగులాంబ గద్వాల
అంతరాలులేని సమాజం కోసం నిరంతరం కార్మిక వర్గం కోసం పోరాడుదామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏ.వెంకటస్వామి అన్నారు. సీఐటీయూ 54వ ఆవీర్భావ దినోత్సవం సందర్బంగా స్ధానిక పాత బస్టాండ్‌ లో సీఐ టీయూ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ 1970 మే నెలలో కలకత్తాలో సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్‌ ( సీఐటీయూ )ఆవిర్భవించిందని అన్నారు. ఐక్యత పోరాటాలు నినాదా లుగా గత 54సంవత్సరాల నుంచి కార్మిక వర్గ ఐక్యత కోసం వారిని సంఘటితం చేసి పోరా టాలలో భాగస్వాములను చేసిందన్నారు. అసంఘ టితరంగ కార్మికులను సంఘటి తపరిచి వారి హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేసి అంత రాలు లేని సమాజం కోసం సీఐటీయూ నిరంతరం పోరాటం చేస్తోందని అన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సీఐటీయూ మాత్రమే కార్మిక వర్గం కోసం 26 చారిత్రాత్మక సమ్మేలను నిర్వహించిందని అన్నారు. కార్మికులను సంఘటితం కానీయకుండా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు , యాజమాన్యాలు ఎన్ని కుట్రలు చేసిన సీఐటీయూ వారిని ఐక్యత పరిచి పోరబాట నడిపిందని పేర్కొన్నారు. కార్మికులను కట్టు బానిసలుగా చేసే పెట్టుబడిదారి సమాజానికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని సమీకతపరిచి వారికి వారి హక్కులను తెలియజేసి వారిలో చైతన్యాన్ని నింపి నిరంతరం పోరబాటలో వారిని నడిపిం చిందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికు లను విచ్చిన్నం చేస్తూ కార్మిక హక్కులు, చట్టాలను కాలరాస్తూ వారిని కట్టు బానిసలుగా మధ్యయుగాల కాలం నాటికి తీసుకెళ్లే ప్రయ త్నం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో వద్ధి మా త్రం పెరుగుతోందని, కానీ అది ధనవంతులను మరింత ధనవంతులుగా .. కార్మికులను మరింత పేదలుగా దిగజార్చే అభివద్ధి జరుగుతుందని విమర్శించారు. పెట్టు బడిదారీ సమాజంలో సంపద కేంద్రీకతం అవుతుందని , దీంతో కార్మికుల జీవన ప్రమాణాలు గణనీయంగా తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు కష్టపడి సష్టించిన సంపదలో భాగస్వామ్యం దక్కడం లేదని సంపదలో వాటా, భాగస్వామ్యం దక్కేవరకు ఆదాయ సమానతలు తగ్గింతవరకు అంతరాలు లేని సమాజం కోసం కార్మిక వర్గం తరపున సిఐటియు పోరాటం చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్‌ నరసింహ రామకష్ణ గజేంద్ర మజ్జిగ ఆంజనేయులు నరేష్‌ ఏళ్లప్ప చంద్రం విరేష్‌ కొత్తపల్లి నరసింహ తదితరులు పాల్గొన్నారు.
హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటం..
– జిల్లా కార్యదర్శి వీ. వీ నరసింహ
గట్టు: సీఐటీయూ ఆవిర్బావం నుంచి ఇప్పటివరకు సంఘటిత, అసంఘాటిత కార్మికుల సమస్యలపై సీఐటీయూ నిరంతర పోరాటాలు చేస్తుందని సీఐటీయు జిల్లా కార్యదర్శి వీ.వీ నరసింహ అన్నారు. సీఐటీయూ 54 వ ఆవీర్బవ దినోత్సవాన్ని పునస్కరించుకొని గట్టు బస్టాండ్‌ ఆవరణలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భ ంగా ఆయన మాట్లా డుతూ 1970 సంవత్సరం లో ఐక్యత – పోరాటం నినాదంతో యూ నియన్‌ ఏర్పా టు జరిగిందని, అనేక పోరాటాలు రూప కల్పన తో కార్మిక వర్గం విజయాలు సాధించిందని అన్నారు. ప్రభుత్వాలు విద్యా, వెద్యం ప్రైవేట్‌ చేయటంతో కార్మిక వర్గం ఆర్థికంగా ఇబ్బందులు పడుతు న్నారని అన్నారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టా లను కార్పరెట్‌ శక్తుల కొరకు ఆ చట్టాలను నిర్వీర్యం చేసిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ లను కేంద్ర ప్రభుత్వం ప్రయివేట్‌ చేయటం వలన నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, ఫలితంగా రిజర్వేషన్‌ విధానాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తుందని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతన చట్టాన్ని సవరించటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. హమాలీ, ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులకు సంక్షేమ బోర్డుకు కార్మికులు పోరాటాలు చేస్తు న్నారని, సంక్షేమ బోర్డు సాధనకు కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.కార్మిక వర్గం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వామి లింగయ్య నరసింహ లక్ష్మన్న నర్సింలు చంద్రు పరశురాముడు తదితరులు పాల్గొన్నారు.