ప్రజాస్వామ్య హక్కులకై పోరాటం చేద్దాం

తమ్మెర విశ్వేశ్వరరావు సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు
నవతెలంగాణ-తొర్రూరు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా స్థానిక సిపిఐ పార్టీ కార్యా లయంలో శుక్రవారం మండల పార్టీ కార్యదర్శి కామ్రేడ్‌ గట్టు శ్రీమన్నారాయణ జా తీయ పతాకావిష్కరన చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్‌ తమ్మెర విశ్వేశ్వరరావుమాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్న ఇంకా తెలంగాణ ప్రజల వాక్‌ స్వాతంత్రం, ప్రజాస్వామ్య హక్కులను ఉమ్మడి రాష్ట్రంలో కంటే హీనంగా తెలంగాణ ప్రభుత్వం కాలరాస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.తెలంగాణ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను ఇంకా ఈ ప్రజలకు నెరవేర్చకుండా కాలం గడుపు తూ ఉన్నదని, ముఖ్యంగా పేద వర్గాలకు డబల్‌ బెడ్‌ రూమ్‌ పథకం అందని ద్రాక్ష లాగా మారిందన్నారు.ఒక పక్కన ధరలు పెరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం డబ ల్‌ బెడ్‌ రూమ్‌ పథకాన్ని 3 లక్షలకు కుదిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతి రేకిస్తున్నామని,అలాగే పోడు భూములు పంచుతామని చెప్పి ఎన్నికలు సమీపిస్తు న్న సమయంలో ఆదరాబాదరాగా అర్హులైన వాళ్లకి భూములు పంచకుండా టిఆర్‌ ఎస్‌ పార్టీ మద్దతుదారులకు మాత్రమే ఈ పంపిణీ జరిగే అవకాశాలు ఉన్నట్లుగా తోస్తున్నదని ఆయన ఆరోపించారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ పథకం ఇంతవరకు అమలు చేయలేక పోవటం వల్ల రాష్ట్ర రైతాంగం బ్యాంకులలో అప్పు లు, వడ్డీలు అధికంగా పేరుకు పోతున్నాయని ఆయన తెలిపారు. రైతులు పండిం చిన పంటను కొనుగోలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేయడంలో తీవ్ర జాప్యం జరగటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కాబట్టి తెలంగాణలో కూడా వాక్‌ స్వా తంత్రం లేకుండా ప్రశ్నించే వ్యక్తులను గహనిర్బంధాల పేరిట పోలీసు దశ్యాలకు పాల్పడుతూ ఉన్నదని, ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనలకు సైతం ప్రతిపక్ష పా ర్టీల నాయకులను గృహనిర్బంధించేయడం విచారించదగ్గ విషయంఅని అన్నారు. ఇప్పటికైనా ఈ పరిణామాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యుతంగా పోరాటం చేయ వలసిన అవసరం ఉన్నదని ఆ దిశగా అందరూ కలిసి రావాలని విశ్వేశ్వరరావు పి లుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు మంగళంపల్లి మల్ల య్య, మంగళంపల్లి ఎల్లయ్య, గ్రామ శాఖ కార్యదర్శి ముద్రబోయిన వెంకన్న, ఏఐ టీయూసీ జిల్లా నాయకులు ప్రభాకరు, హమాలీ నాయకులు పాల్గొన్నారు.