
నవతెలంగాణ – డిచ్ పల్లి
అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో పిడిఎస్ యూ ఆధ్వర్యంలో వంట చేసే మహిళలకు సన్మానం చేశారు.ఈ సందర్భంగా పిడిఎస్ యూ యూనివర్సిటీ కార్యదర్శి జయంతి మాట్లాడుతూ మహిళలు కుటుంబ పోషణ కోసం ఇంట్లో, బయట ఎంతో కష్టపడుతున్నారని, పనిచేసే చోట ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని , చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారాని ,పనికి సమానంగా మహిళలకు వేతనాలు ఇవ్వాలని , యూనివర్సిటీలో పనిచేసే మహిళలను రెగ్యులర్ చేయాలని , సమాజంలో మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ పి.డి.ఎస్.యూ సభ్యులు నవ్య, అనూష, బిందు, తదితరులు పాల్గొన్నారు.