ఎర్రజెండా సాక్షిగా కార్మిక హక్కులకై కొట్లాడుదాం..

– సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ప్రపంచ కార్మికులారా ఏకంకండి అంటూ 138వ మేడేసందర్బంగా ఎర్రజెండా సాక్షిగా కార్మిక హక్కులకై కొట్లాడుదామని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ చండ్ర పుల్లా రెడ్డి విజ్ఞాన కేంద్రంలోని పార్టీ దిమ్మే పై  జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామ్రాజ్యవాదం పెట్టుబడి దారిదేశమైన అమెరికా లోనే ఈ ఎర్రజెండా పుట్టిందని ఆనాడే కార్మికుల హక్కుల కోసం పని దినాల కోసం హీరోచితమైన పోరాటాలు నిర్వహించి కార్మిక హక్కులను సాధించిందని అన్నారు. నాడు అమరవీరుల సాక్షిగా సాధించుకున్న కార్మిక హక్కులను నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం హిందూ పాసింజం పేరుతో నాలుగు లేబరు చట్టాలను తీసుకువచ్చి కార్మిక హక్కులని కాలరాస్తూ బానిస సమాజంలోకి నెట్టి వేస్తుందని కార్మికుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు జేబు సంస్థలు గా మారాయని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికి మళ్ళీ అధికారంలోకొస్తే రాజ్యాంగాన్ని రద్దుచేసి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తామని కార్మిక హక్కులు ఉండవని నూతన చట్టాలు అమలులోకి వస్తాయని బహిరంగంగా ప్రకటిస్తూ ఎన్నికలు అంటే ఇక ఒకే ఎలక్షన్స్ ఉంటాయని ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమం లో ఎస్.కె సుభాని, పుప్పాల వీరన్న, బండి రవి, దండి ప్రవీణ్, జానయ్య, పెద్దింటి అశోక్ రెడ్డి, మందడి శ్రీధర్, గజ్జల మల్లా రెడ్డి, బాణాల వినోద్ రెడ్డి, సాయబు హుసేన్, బొడ్డు ముత్తయ్య, జయరాజు, అర్జున్, పిడమర్తి భరత్, రహీం, దుర్గయ్య, శ్రవణ్, నిమ్మల హరి ప్రసాద్, గుంటి మురళి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.