మీ పిల్లల భావోద్వేగ స్థితిని గమనించండి. ఎందుకంటే కొంతమంది పిల్లలు తమ ఆందోళనలను మాటలతో వ్యక్తం చేయకపోవచ్చు. వివరించలేని గాయాలు, గీతలు, విరిగిన ఎముకలు, శరీరంపై మానిన గాయాల గుర్తులు, స్కూల్‌కి వెళ్లాలన్నా, స్కూల్ ఈవెంట్స్‌లో చేరాలన్నా భయం.
– ఆత్రుతగా లేదా చాలా అప్రమత్తంగా ఉండటం. పాఠశాలలో లేదా పాఠశాల వెలుపల కొద్దిమంది స్నేహితులను కలిగి ఉండటం.
– అకస్మాత్తుగా స్నేహితులను కోల్పోవడం లేదా సామాజిక కార్యకలాపాలకు దూరంగా ఉండడం.
– దుస్తులు, ఎలక్ట్రానిక్స్ లేదా ఇతర వ్యక్తిగత వస్తువులు పోగొట్టుకోవడం లేదా నాశనం చేయడం. తరచుగా డబ్బులు అడగడం, సరిగా చదువు లేకపోవడం.
– పాఠశాలకు గైర్హాజరు, ఇంటికి తీసుకెళ్ళమని పాఠశాల నుండి కాల్ చేయడం, పెద్దల దగ్గర ఉండేందుకు ప్రయత్నించడం, నిద్రలేమి, పీడకలలు, తలనొప్పి, కడుపు నొప్పులు లేదా ఇతర శారీరక రుగ్మతల గురించి ఫిర్యాదు చేయడం. ఆన్‌లైన్‌లో లేదా ఫోన్‌లో సమయం గడిపిన తర్వాత కచ్చితంగా బాధపడతారు. ముఖ్యంగా ఆన్‌లైన్ కార్యకలాపాల విషయానికి వస్తే రహస్యంగా ఉంచుతారు.
– దూకుడుగా ఉండటం లేదా కోపాన్ని వ్యక్తం చేయడం.
పై లక్షణాలు మీ పిల్లల్లో గుర్తించినపుడు పాఠశాలలో, సంఘంలో, ఆన్‌లైన్‌లో మంచి చెడు ప్రవర్తన గురించి వారితో మాట్లాడండి. వారి జీవితంలో ఏం జరుగుతుందో చెప్పుకునేలా వారితో మీ సంభాషణ ఉండటం చాలా ముఖ్యం.
మీ బిడ్డ బెదిరింపులకు గురవుతున్నట్లు తెలిస్తే…
మీ బిడ్డ చెప్పేది ప్రశాంతంగా వినండి: బెదిరింపులకు కారణాన్ని కనుగొనడానికి, సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించే బదులు ముందు వారు చెప్పింది పూర్తిగా వినండి. మీ మద్దతు వారికి ఉంటుందనే నమ్మకాన్ని ఇవ్వడంపై దృష్టి పెట్టండి. అది వారి తప్పు కాదని నిర్ధారించుకోండి.
మీ బిడ్డకు భరోసా ఇవ్వండి : మీరు వారిని విశ్వసిస్తున్నారని పిల్లలకి చెప్పండి. వారు మీకు చెప్పినందుకు మీరు సంతోషిస్తున్నారని, అది వారి తప్పు కాదని, సహాయం చేసేందుకు మీ వంతు కృషి చేస్తాననే భరోసా ఇవ్వండి
ఉపాధ్యాయులు లేదా పాఠశాల వారితో మాట్లాడండి: మీ బిడ్డ ఒంటరిగా బెదిరింపులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. పాఠశాలలో బెదిరింపు విధానం లేదా ప్రవర్తనా నియమావళి ఉందా అనేది అడగండి.
మద్దతు వ్యవస్థగా ఉండండి: మీ పిల్లల కోసం బెదిరింపులు ఎదుర్కోవటానికి సహాయం చేసే తల్లిదండ్రులుగా ఉండటం చాలా అవసరం. వారు ఎప్పుడైనా మీతో మాట్లాడవచ్చనే నమ్మకాని ఇచ్చే ఓ మద్దతు వ్యవస్థను నిర్మించండి.
మీ బిడ్డ ఇతరులను వేధిస్తే: మీ పిల్లలు ఇతర పిల్లలను బెదిరింపులకు గురిచేస్తున్నారని మీకు అనిపించినా, తెలిసినా వారు స్వతహాగా చెడ్డవారు కాదని, అనేక కారణాల వల్ల వారు ఇలా ప్రవర్తించే అవకాశం ఉందని గుర్తుంచుకోవడం ముఖ్యం. వారిపై శ్రద్ధ పెట్టండి. సంక్లిష్టమైన భావోద్వేగాలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోండి. కొన్ని సందర్భాల్లో వేధించే పిల్లలు ఇంట్లోనో, సమాజంలోనో హింసకు బాధితులు లేదా సాక్షులుగా ఉండొచ్చు.
మీ పిల్లల బెదిరింపును ఆపడానికి మీరు తీసుకోవలసినవి…
కమ్యూనికేట్ చేయండి: మీ పిల్లలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకుంటే వారికి ఎలా సహాయం చేయాలో మీకు తెలుస్తుంది. వారు పాఠశాలలో అభద్రతా భావంతో ఉన్నారా? స్నేహితుడితో లేదా తోబుట్టువుతో గోడవపడుతున్నారా? వారి ప్రవర్తనను మీరు సరిగా అంచనా వేయలేకపోతుంటే శిక్షణ పొందిన కౌన్సెలర్ లేదా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.
ఆరోగ్యవంతమైన కోపింగ్ మార్గాల ద్వారా పని చేయండి: నిరాశ పరిచిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పమని పిల్లల్ని అడగండి. ప్రతిస్పందించడానికి నిర్మాణాత్మక మార్గాలను అందించండి. వేధింపులకు గురైన వ్యక్తి అనుభవాలను వారి ద్వారానే పిల్లలకు చెప్పించండి. ఆన్‌లైన్‌లో చేసిన వ్యాఖ్యలు వాస్తవ ప్రపంచంలో ఇప్పటికీ బాధిస్తున్నాయని మీ పిల్లలకు గుర్తు చేయండి.
మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి : వేధించే పిల్లలు సాధారణంగా ఇంట్లో వారిని చూసే నేర్చుకుంటారు. వారు మీ నుండి కానీ, సంరక్షకుని నుండి కానీ శారీరకంగా లేదా మానసికంగా హానికరమైన ప్రవర్తనకు గురవుతున్నారేమో లోతుగా పరిశీలించండి. మీరు మీ బిడ్డకు ఎలా ప్రెజెంట్ చేస్తున్నారో నిజాయితీగా ఆలోచించండి.
సవరణలు చేయడానికి అవకాశం ఇవ్వండి. మీ బిడ్డ బెదిరింపులకు పాల్పడినట్లు మీరు తెలుసుకుంటే దాని పరిణామలు ఎలా ఉంటాయో వారికి తగిన సూచనలు చేయడం చాలా ముఖ్యం. ఇది వారి కార్యకలాపాలను పరిమితం చేస్తుంది. ముఖ్యంగా బెదిరింపులను ప్రోత్సహించే వాటిని (సామాజిక సమావేశాలు, స్క్రీన్/సోషల్ మీడియా సమయం). మీ పిల్లలను వారి సహచరులకు క్షమాపణలు చెప్పమని ప్రోత్సహించండి. భవిష్యత్తులో వారిని మరింత కలుపుకొని పోయేలా మార్గాలను కనుగొనండి.
– డా|| హిప్నో పద్మా కమలాకర్
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్