ఓటుతో ఓడిద్దాం… ప్రజలను గెలిపిద్దాం
– బత్తుల వెంకటేశ్వర్లు
నవతెలంగాణ- బూర్గంపాడు
మండలంలో చెరువు సింగారంలో ఉపాధి పని ప్రదేశాన్ని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి పనికి ప్రమాదం ముంచుకొస్తుందని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల్ని అన్ని రకాలుగా బాదుడు మీదనే ఉంది తప్ప ఏ ఒక్క పని కూడా ప్రజలకి ఉపయోగం లేదని ఆయన అన్నారు. ఈ పది సంవత్సరాలలో ఒక్క మంచి పనైనా చేయలేదని, సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం అమలు చేయలేక పోయిందని ఆయన విమర్శించారు. ఆఖరికి దేశంలో ఉన్న పారిశ్రామిక ఫ్యాక్టరీలు 250 మూతపడే స్థితికి తీసుకొచ్చారని, దేశంలోని పెద్ద, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను ప్రయివేట్ పరం చెయ్యాలని ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఆఖరికి ఏన్నో ప్రభుత్వ రంగాలన్ని ప్రయివేటుపరం చేయడం కూడా జరిగిందని, సామాన్య ప్రజలపైన భారాలు మోపుతూ నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితి తీసుకొచ్చారని ఆయన అన్నారు. పెట్రోలు, డీజిల్ వంట గ్యాస్ పెంచి ప్రజల నడ్డి వీపువిరిచారని, అందుకు రానున్న మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో సీపీఐ(ఎం) బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గుర్తు హస్తం గుర్తుకి ఓటేసి గెలిపించాలని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలోని మతోన్మాద ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇంటికి సాగానంపాలని, ఉపాధి కార్మికుల్ని కోరుతూ నినాదాలతో హస్తం గుర్తుకే మన ఓటు అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్ప సత్యనారాయణ, సర్ప ముత్తయ్య, శెట్టి వసంత రావు, కుంజ జోగారావు సోయం వీరస్వామి, పోడియం శ్రీను, మడకం రాంబాబు, సర్ప తిరపతయ్య, కొర్సనా గేష్ తదితరులు పాల్గొన్నారు.