‘ఇచ్చుకుందాం బేబీ..’

'Let's give it baby..'విశ్వక్‌సేన్‌ నటిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘లైలా’. రీసెంట్‌గా రిలీజైన టీజర్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈ చిత్రంలో విశ్వక్సేన్‌ అమ్మాయి, అబ్బాయిగా కనిపించ నున్నారు.  రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ‘లైలా’ ఫస్ట్‌ సింగిల్‌ సోనూ మోడల్‌ వీడియో సాంగ్‌ చార్ట్‌ బస్టర్‌ హిట్‌ అయ్యింది.  మంగళవారం మేకర్స్‌ సెకండ్‌ సింగిల్‌ అప్డేట్‌ ఇచ్చారు. సెకండ్‌ సింగిల్‌ ‘ఇచ్చుకుందాం బేబీ’ ఈనెల 23న రిలీజ్‌ కానుంది. లీడ్‌ పెయిర్‌ రొమాంటిక్‌ కెమిస్ట్రీని ప్రెజెంట్‌ చేసిన  సాంగ్‌ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ చాలా ఎట్రాక్టీవ్‌గా ఉంది. ఆకాంక్ష శర్మ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.