పోతంగల్ లో పల్లెకి పోదాం

– చలో కార్యక్రమం
నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని పోతంగల్ గ్రామంలో పల్లెకి పోదాం చలో కార్యక్రమంలో భాగంగా బీజేవైఎం మండల కన్వీనర్ బండారి రాజశేఖర్ ప్రబారిగా వెళ్లి గ్రామ సమస్యలను గురువారం తెలుసుకున్నారు. గ్రామంలో దోమలతో వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారని ప్రజలు తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆటస్థలం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, పిఎం కిసాన్, విశ్వకర్మ గరీబ్ కళ్యాణ్, డిజిటల్ సేవలు, జన్ ధన్ యోజన పథకాలపై ప్రజలతో చర్చించి వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల కార్యదర్శి బందెల ఆనంద్, బూత్ అధ్యక్షులు కల్లోల రాజేందర్, శ్రీను, ఖుషి పండిత్, నరేందర్, అఖిలేష్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.