– గవర్నర్ తమిళిసై గణతంత్ర శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ రాష్ట్ర ప్రజలకు 75వ గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి బేధం లేకుండా రాజ్యాంగం అందరికి హక్కులను అందించిందని ఆమె గుర్తుచేశారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి విలువలు కలిగి ప్రజాస్వామ్య దేశంగా ఉండేలా రాజ్యాంగం రూపొందించడమనేది డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ లాంటి దార్శనీకుల ఘనతేనని ఆమె తెలిపారు. ఆ విలువల కోసం మనందరం పునరంకిత మవ్వాలని సూచించారు.