సహాయం చేద్దాం.ప్రాణాన్ని నిలబెడదాం..

– లివర్ వ్యాధితో బాధపడుతున్న సలీమ..
– ఆపరేషన్ కు రూ.30 లక్షలవుతాయన్న వైద్యులు
– ఎన్ ఎన్ జి ఎఫ్ ఆధ్వర్యంలో రూ.1లక్ష సలీమాకు ఆర్థిక  సహాయం
– న్యూ జనరేషన్ ఆఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చిర్రా యాకాంతం గౌడ్ ప్రధాన కార్యదర్శి తాళ్ల మహిపాల్ రెడ్డి
నవతెలంగాణ నెల్లికుదురు: చేయి చేయి కలుపుదాం నిండు ప్రాణానికి సహాయాన్నందిద్దాం, అంటూ ఎన్ జి ఎఫ్ అధ్యక్షులు యాకాంతంగౌడ్ పిలుపుని పిలుపునిచ్చారు.మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎండి సలీమ గత కొంతకాలంగా లివర్ వ్యాధితో బాధపడుతోంది. చాలామంది వైద్యులకు సూచించారు.చాలా డబ్బు ఖర్చయింది.లివర్ మార్పిడి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. ఇందుకురూ.30 లక్షల ఖర్చు అవుతుందని తెలిపారు. అంత డబ్బు లేక ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఎన్ జి ఎఫ్ సభ్యులు స్వతహాగా సలీమా ఆపరేషన్ కోసం రూ.1 లక్ష బుధవారం ఎన్ జీఎఫ్ అధ్యక్షులు యాకాంతం గౌడ్ గౌడ్, జనరల్ సెక్రెటరీ మహిపాల్ రెడ్డి చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా యాకాంతం గౌడ్ మాట్లాడుతూ..ఉన్న ఊరు కన్నతల్లి నినాదంతో ఏర్పడి 32 మంది సభ్యులతో కొనసాగుతున్న ఎన్ జి ఎఫ్ ఆపదలో ఉన్న ఎందరినో ఆదుకున్నదని, సంస్థలో సభ్యునిగా ఉన్న షరీఫ్ తల్లి సలీంమ ను ఆదుకోవడానికి సభ్యులు ముందుకు రావడం, అమెరికాలో ఉన్న చిదిరాల రాజు రూ.50 వేలు పంపించడం అభినందనీయమన్నారు.తమకు తెలిసిన వారితోను ఎన్జీఎఫ్ సభ్యులు సహకారం అందింపచేస్తామనడం మంచితనానికి నిదర్శనమ న్నారు.ఎవరికి తోచిన విధంగా వారు సహకారం అందించాలని అభ్యర్థించారు. ఇలాంటి పేద కుటుంబాలను ఆదుకోవడం మా సంస్థ లక్ష్యం అని అన్నారు. అంతేకాకుండా పేద పిల్లల విద్యార్థుల కోసం ఎన్నో రకాలైన కార్యక్రమాలను అవగాహన కల్పించి వారిని ఆదుకున్నమని అన్నారు. మరియు గ్రామంలో ఏవరు చనిపోయిన కూడా ఒక అర క్వింటా బియ్యం ఇస్తూ కొంతమంది నిరుపేదలకు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నామని అన్నారు. మేము ఈ గ్రామంలో పుట్టి అక్కడక్కడ వివిధ రంగాల్లో ప్రవేట్ ప్రభుత్వ రంగంలో పని చేసుకుంటూ గ్రామాన్ని ఆదుకోవాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. దీంతో గ్రామస్తులు హర్షవర్ధన్ ప్రకటించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా గ్రామ అభివృద్ధికి పూర్తిస్థాయిలో ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నామని తెలిపారు. ఈ కార్య కమంలో  ఎన్ జి ఎఫ్ సభ్యులు తాళ్ల ప్రభాకర్ రెడ్డి అక్కర శ్రీనివాస చారి నలుమాస దిలీప్ కుమార్ చిర్ర వెంకట్ రాపాక చందు బొల్లు అశోక్ కుమార్ పెరుమాండ్ల సుమన్ అజయ్ గౌడ్ ఎస్. కె అజీమ్ వేములకొండ ఉమేష్ శ్రీపాల్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.