భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్న సి ఎస్ ఎన్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి పనులకు పునర్వైభవానికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని ఆ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు పిలుపునిచ్చారు . ఆదివారం జూనియర్ కళాశాల ప్రాంగణంలో కొలుపుల వివేకానంద అధ్యక్షతన పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కళాశాల సమస్యలను ప్రస్తావించారు. భవిష్యత్తులో పునర్ వైభవం తీసుకురావడానికి తీసుకోవలసిన చర్యలపై పలువురు ప్రసంగించారు. పూర్వ విద్యార్థి తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ పెంట నరసింహాలు మాట్లాడారు. ఈ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఉద్యోగ వ్యాపార వాణిజ్య సంక్షేమ రంగాలలో పనిచేస్తూ అనేక ఉన్నతమైన పదవులలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అలాంటి విద్యార్థులను తయారు చేసిన కళాశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు అధునాతనమైన విద్యా విధానం తీసుకురావాలన్నారు. ప్రభుత్వంతో పాటు పూర్వ విద్యార్థులు దీనికి నడుము బిగించాలని కోరారు. కొలుపుల వివేకానంద స్వాగత ఉపన్యాసం చేశారు ఫిబ్రవరి 4న ఇదే ప్రాంగణంలో మరో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోమారి సుధాకర్ రెడ్డి , అతికం లక్ష్మీనారాయణ జైని రవీందర్, హమీద్, కుక్క దూగ సోమయ్య, చింతల కిష్టయ్య, ఎండి హైమద్. పిసరి లింగారెడ్డి, సాదు విజయకుమార్ ,జహంగీర్, జైని వెంకటేశ్వర్లు, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, దొంత బాలరాజు కృపాకర్ రాజు నాగరాజు గంధ మల్ల రవి, మనోరంజన్ రెడ్డి, మామిడి వెంకట్ రెడ్డి, రాజా పాల్గొన్నారు.