పెనం జిడ్డుగాను వదిలిద్దాం..

Let's leave penam jidduga..మనం వంటింట్లో ఎన్నో రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకొని తింటూ ఉంటాము. ఈ క్రమంలోనే వారంలో రెండు మూడు సార్లయినా దోశ, చపాతి చేయడం కోసం పెనం ఉపయోగిస్తూ ఉంటాము. ప్రస్తుత కాలంలో చాలామంది నాన్‌ స్టిక్‌ పెనం ఉపయోగిస్తున్నారు. కానీ ఆరోగ్యంపై ఇటీవల కాలంలో చాలా మంది దష్టి సారించి ఐరన్‌ పెనం కూడా ఉపయోగిస్తున్నారు. ఇలా ఇనుప పెనం వాడటం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
పెనం ఉపయోగించే క్రమంలో కొద్ది రోజులకే అది జిడ్డుగా మారిపోయి చివరిన నల్లగా కూడా తయారవుతుంది ఇలాంటి వాటిలో ఆహార పదార్థాలు తయారు చేసుకుంటే అది ప్రమాదకరంగా మారుతుంది. ఇలా పేరుకుపోయిన జిడ్డు మరకలు ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు పోవు. ఈ సింపుల్‌ చిట్కాలను ఉపయోగించి పెనంపై ఉన్నటువంటి జిడ్డు మరకలను చాలా ఈజీగా తొలగించవచ్చు.
ఒక నిమ్మకాయ తీసుకొని మధ్యలో కట్‌ చేసి దానిని ఉప్పులో ముంచి పెనం మొత్తం రుద్దాలి ఇలా ఐదు నిమిషాల పాటు ఉంచిన తర్వాత వేడి నీటితో శుభ్రం చేసి స్క్రబ్‌ తీసుకొని బాగా రుద్దితే జిడ్డు మరకలు పోతాయి.
వెనిగర్‌ కూడా పెనం మీద జిడ్డును తొలగించడానికి చాలా బాగా సహాయ పడుతుంది. ఒక గిన్నెలో నీరు, వెనిగర్‌ సమాన భాగాలుగా తీసుకుని బాగా కలిపి స్పాంజ్‌ సాయంతో పెనం మీద రుద్దితే జిడ్డు మొత్తం తొలగిపోతుంది. ఇలా ఈ సింపుల్‌ చిట్కాలతో ఈజీగా జిడ్డును తొలగించి శుభ్రం చేసుకోవచ్చు.