ఆర్యవైశ్య కార్పొరేషన్‌ సాధన దీక్షను విజయవంతం చేద్దాం

– రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రేణిగుంట గణేష్‌ గుప్తా
నవతెలంగాణ-కొత్తూరు
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ఇందిరా పార్క్‌లోని ధర్నా చౌక్‌ వద్ద ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ఆధ్వర్యంలో ఈ నెల 30న నిర్వహించ తలపెట్టిన వైశ్య కార్పొరేషన్‌ సాధన దీక్షకు మండలంలోని ఆర్యవైశ్యలందరూ పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజేషన్‌ సెక్రటరీ రేణిగుంట గణేష్‌ గుప్తా, గందె సురేష్‌ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని మందోని మైసమ్మ ఆలయం వద్ద సంఘం మండల అధ్యక్షుడు దయానంద్‌ గుప్తా ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఆర్యవైశ్య మండల సంఘం సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య కార్పొరేషన్‌ సాధనకు సాయి శక్తుల కషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు వజ్ర లింగం, మహేందర్‌, సోమ నరేందర్‌, అనుమారి మురళీధర్‌, రాజు, శివకుమార్‌, ఉప్పల మనోహర్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.