అచ్చంపేటను పరిశుభ్రంగా మారుద్దాం: ఎమ్మెల్యే

Let's make Acchampet clean: MLA– పట్టణ పుర, ప్రముఖులకు, వ్యాపారస్తులకు ప్రజలందరికీ పిలుపు
– స్వచ్ఛదనం – పచ్చదనంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ
నవతెలంగాణ – అచ్చంపేట 
పరిసరాలను పరిశుభ్రం చేసి అచ్చంపేటను పరిశుభ్రంగా ఉంచాలని పట్టణంలోని ప్రముఖులకు వ్యాపారస్తులకు ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పిలుపునిచ్చారు. స్వచ్ఛ ధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని 14 వార్డు లో మురికి కాలువ లశుభ్రతను పరిశీలించారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం – పరిశుభ్రత  మెరుగుపరచాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పచ్చదనం- స్వచ్ఛధనం లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. మల్లంకుంట చెరువును పరిశీలించి  కొద్ది రోజుల్లో మల్లంకుంట చెరువు పనులను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ గార్ల పట్టి శ్రీనివాసులు, కమిషనర్ శ్యాంసుందర్, కౌన్సిలర్లు గౌరీ శంకర్, నాయకులు పాల్గొన్నారు.