ఏప్రిల్ 14న భీమ్ యాత్రను విజయవంతం చేద్దాం

– మహనీయుల జయంతి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణలో నాయకుల పిలుపు.
నవతెలంగాణ – భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి పట్టణంలో ఈ నెల 14 న నిర్వహించబోయి భీమ్ యాత్ర ను విజయవంతం చెయ్యాలని  శనివారం భువనగిరి పట్టణం తారక రాంనాగర్, బంజారాహిల్స్, కాలనీలలో  మహనీయుల జయంతి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ పాల్గొని మాట్లాడారు.నిన్నటి నుండి 14 వ తేదీ వరకు అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే మహనీయుల జయంతి కార్యక్రమలను విజయవంతం చేసి ప్రతి ఒక్కరికి అంబేద్కర్ జీవిత చరిత్ర తెలుసుకోవాలి ప్రతి ఒక్కరి ఇంట్లో భారత రాజ్యాంగం పుస్తకం ఉండాలన్నారు. చదవాలని కోరారు ఈ నెల 14న జరుగుతున్న భీమ్ యాత్ర లో ప్రతి ఒక్కరు పాల్గొని మన శక్తి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాణోత్ వెంకట్ నాయక్, ఈరపాక నర్సింహ, బర్రె నరేష్,  మెడి కొటేష్, వెంకట్ నాయక్ పడిగల ప్రదీప్, దిరవత్ రాజేష్, కాళీ నాయక్, సిర్పంగా శివలింగం ఇటుకల దేవేందర్, కర్తల శ్రీనివాస్, బర్రె నగేష్, పిన్నింటి స్టాన్లీ, కొండమడుగు అశోక్ లు పాల్గొన్నారు.