ఏప్రిల్ 14న భీమ్ యాత్రను విజయవంతం చేద్దాం: పొత్నక్

– మహనీయుల జయంతి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణలో నాయకుల పిలుపు
నవతెలంగాణ – భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి పట్టణంలో ఈ నెల 14 న నిర్వహించబోయి భీమ్ యాత్ర ను విజయవంతం చెయ్యాలని భువనగిరి పట్టణం హౌసింగ్ బోర్డ్, బహర్ పెట్, సింగన్నగూడెం కాలనీలలో  మహనీయుల జయంతి ఉత్సవాల పోస్టర్  ను  మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ప్రమోద్ కుమార్ ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి ఒక్కరికి అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెలుసుకోవాలి ప్రతి ఒక్కరి ఇంట్లో భారత రాజ్యాంగం పుస్తకం ఉండాలి చదవాలన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా మనమంతా పోరాటం చేయాల్సి అవసరం ఉందని అన్నారు. అలాగే  ఏప్రిల్ 5 నుండి 14 వ తేదీ వరకు అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే మహనీయుల జయంతి కార్యక్రమలను విజయవంతం చేసి  ఈ నెల 14న జరుగుతున్న భీమ్ యాత్ర లో ప్రతి ఒక్కరు పాల్గొని మన శక్తి ప్రదర్శన చెయ్యాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ  మైనార్టీ ల ఐక్యత వర్ధిల్లాలి అన్నారు. ఈ కార్యక్రమంలో దొనకొండ రాములు ఈరపాక నరసింహ, ఎం. డి ఇమ్రాన్ సిరిపంగ శివలింగం ఇటుకల దేవేందర్ నిలుగొండ శివశంకర్ బర్రె ప్రమీల బుగ్గ జయ కర్తల శ్రీనివాస్ బాణోత్ భాస్కర్ నాయక్ బాసాని మహేందర్  చింతల శివ కోళ్ల కృష్ణ  నరసింహ సంపత్ సందీప్ వెంకటేష్ పాల్గొన్నారు.