క్యామ మల్లేష్‌ను అధిక మెజార్టీతో గెలిపిద్దాం

– రేపు కేటీఆర్‌ మీటింగ్‌ను విజయవంతం చేద్దాం
– బీఅర్‌ఎస్‌ మండలాధ్యక్షులు చీరాల రమేష్‌,
– మండల ప్రధాన కార్యదర్శి కాట్రోత్‌ బహదూర్‌
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్‌
భువనగిరి పార్లమెంటు అభ్యర్థి క్యామ మల్లేష్‌ను భారీమెజార్టీతో గెలి పించాలని మంచాల మండలాధ్యక్ష, కార్యదర్శులు చీరాల రమేష్‌, కాట్రోత్‌ బహదూర్‌లు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాల యంలో మండల ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లా డుతూ.. శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రమీద గార్డెన్‌లో జరుగు బీ అర్‌ఎస్‌ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి బీఅర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరు కానున్నారని తెలిపారు. కాబట్టి మండలం నుండి పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్‌ నర్మద లచ్చిరాం, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మెన్‌ ఏర్పుల చంద్రయ్య, పీఏసీఎస్‌ చైర్మెన్‌ బుస్సు పుల్లారెడ్డి, సీనియర్‌ నాయకులు జంబుల కిషన్‌ రెడ్డి, చింద ము రఘుపతి, కే.రాంరెడ్డి, ఆకారం కృష్ణ, మాజీ ఎంపీపీ మంకు ఇందిరా, ఎంపీటీసీ.సుకన్య శేఖర్‌రెడ్డి, మార్కె ట్‌ కమిటీ మాజీ డైరక్టర్‌లు ఎండీ జానీ పాషా, నారి యాదయ్య, యువజ న విభాగం మండల అధ్యక్షులు వనపర్తి బద్రీనాథ్‌ గుప్తా, నాయకులు రాజునాయక్‌, ఇటుకల ప్రకాష్‌ రెడ్డి, రావుల శంకర్‌ తదితరులున్నారు.