చలో ఢిల్లీని విజయవంతం చేయాలి..

Let's make Delhi successful.. కరపత్రం విడుదల చేసిన పల్లగొర్ల మోదీరాందేవ్..
నవతెలంగాణ – భువనగిరి
వచ్చే నెల ఫిబ్రవరి 6,7న జరగబోయే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భువనగిరి పట్టణ కేంద్రంలో బీసీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  శుక్రవారం కరపత్రం ఆవిష్కరణ  చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్  మాట్లాడుతూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ   ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో  జంతర్ మంతర్ వద్ద ధర్నా జాతీయ సెమినార్లు  కార్యక్రమానికి  తరలిరావాలని కోరారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.   దేశంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. ఈ సమావేశంలో విద్యార్థి సంఘం నాయకులు వేముల అనిల్ కుమార్, శరత్ యాదవ్, వట్టెం మధు, మహేష్,ఎలేష, రాజు గౌడ్, భాస్కర్, చంటి ముదిరాజ్, విజయ్ కుమార్, వినయ్  పాల్గొన్నారు.