డిచ్ పల్లి కి నెంబర్ వన్ చేద్దాం..

– అధికారులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలి..
– పెండింగ్ పనులను పూర్తి చేయాలి..
– ఆర్టీసీకి లాభాలు తెచ్చాం..
– రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి
నవతెలంగాణ – డిచ్ పల్లి
నిజాంబాద్ జిల్లాలోని డిచ్ పల్లి మండలానికి నంబర్ వన్ వచ్చే విధంగా అందరు కలిసికట్టుగా కృషి చేద్దామని, తను అధికారులతో సఖ్యతగా ఉంటానని ఒకటికి రెండుసార్లు తమ పనితీరు మార్చు కొన్ని పక్షంలో మూడోసారి కఠిన చర్యలు ఉంటాయని అంకితభావంతో విధులు నిర్వహించాలని వీధుల్లో రాజకీయాలు చేయవద్దని, మండలంలో పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేసే విధంగా చొరవ చూపాలని దీనికోసం ఉన్నతాధికారులతో మాట్లాడతానని, గతంలో ఆర్టీసీ నష్టాలు చవిచూసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించి నేడు లాభాల్లోకి తీసుకొని వచ్చామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు.శనివారం డిచ్ పల్లి మండల పరిషత్ సమావేశం ఎంపీపీ చిన్నోళ్ల నర్సయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ ఆరు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని దీనిలో మూడు నెలలు ఎన్నికల కోడ్ ఉండడంతో ఇలాంటి సంక్షేమ పథకాలు నూతనంగా తీసుకురాలేదన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీపై క్యాబినెట్లో చర్చించి ఒకేసారి మాఫీ చేస్తామని నిర్ణయించడం హర్షదయాక మన్నారు. గతంలో ఎన్నడు లేనటువంటి క్యాబినెట్ నేడు ఉందని ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామన్నారు. పది రోజుల్లో గా ధరణి సమస్యలను పరిష్కరించేల రెవెన్యూ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని, పెండింగ్ సమస్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి అన్నారు. గడిచిన 10ఏళ్ల బారాస ప్రభుత్వ కాలంలో ధరణి ధరఖాస్తులు లక్షలాది గా పెండింగ్ లో ఉన్నాయని వాటి పరిష్కారానికి రేవంత్ ప్రభుత్వ ప్రత్యేక చొరవ తో తిసుకుంటుంద
న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలను నేరవేరుస్తు ముందుకు సాగుతున్నమని రైతాంగానికి 2లక్షల రుణామాఫీ కూడా క్యాబినెట్ సమావేశంలో నిర్ణాయం తీసుకోవడం జరిగిందన్నారు. ఐకేపీ ఉద్యోగులు ఉద్యోగులగా పనిచేసుకోవాలని రాజకీయాలు చేస్తే సహించేది లేదన్నారు. 200 యూనిట్ల కరెంట్ బిల్లు, 500రూ. గ్యాస్ సిలిండర్ ధరఖాస్తు చేసుకున్న వారు ఎంపీడివో కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని ఇందుకు అధికారులు సహకరించలన్నారు. పోడు భూముల రైతులకు పట్ట పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని తెలి పారు. ధరణి సమస్యలు జిల్లా కలెక్టర్, ఆర్జీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో పరిష్కారమయ్యే పనులు పెండింగ్ లో ఉన్నాయని వాటి పరిష్కారానికి అధికారులు సహకరించలన్నారు. 100దరణి ధరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని గ్రామాల్లో గిరిజన తాండల్లో రేషన్ షాపులు ఇంచార్డ్లకు నియామించకుండా ఆయా గ్రామాల వారికే బాధ్యతలు అప్పగిం చలన్నారు. దూస్ గాం రోడ్డు నిర్మాణ పనులను టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్ మహేందర్ రెడ్డి పనులు చేయడానికి ముందుకు రావడం లేదని ఆర్ అండ్ బీ ఏఈ మనోహర్ ఎమ్మెల్యే కు వివరించారు. రెండు మార్లు నోటీసులు కూడా కాంట్రాక్టర్కు ఇచ్చమన్నారు. గత ప్రభుత్వ హయంలో ఇచ్చిన గొర్రెల డీడీలు పెండింగ్ లో ఎమైన ఉన్నాయని ఎమ్మెల్యే ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ భావనల నిర్మాణలు, సబ్ సెంటర్ నిర్మాణ పనులు పూర్తి చేసేల అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పూర్తి స్థాయిలో శిదిలవస్థకు చేరిన నీటి ట్యాంకులను తీసివేయాలని వివరాలను  అందజేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. తొలసారిగా ఎమ్మెల్యే గా మండల సమావేశానికి వచ్చిన భూపతిరెడ్డి ని ఎంపీపీ నర్సయ్య, జడ్పీటీసీ దాసరి ఇందిరా, వైస్ ఎంపీపీ సాయిలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవీందర్, ఎంపీవో శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్ ప్రభాకర్, ఎంఈవో రాజగంగారం, ఇతర అధికారులు ఎంపీటీసీలు,కో ఆప్షన్ సభ్యులు, ఆయా శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.