నవతెలంగాణ – రామారెడ్డి
ఫిబ్రవరి 7న హైదరాబాదులో లక్ష డబ్బులు, 1000 గొంతుకలతో మాదిగల గుండె చప్పుడు వినిపిస్తామని శనివారం కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు మంథని సామ్యేల్ మాదిగ అన్నారు. మద్దికుంట అధ్యక్షునిగా తాండ్ర మల్లేష్, ఉపాధ్యక్షునిగా పల్లె స్వామి, ప్రధాన కార్యదర్శిగా గిరి సాయిలు, యూత్ అధ్యక్షునిగా చిన్నవాలి లింగం, ఉపాధ్యక్షులుగా సురేందర్, ప్రధాన కార్యదర్శిగా నిఖిల్, మహిళా అధ్యక్షురాలుగా గిరి శాంతవ్వ, ఉపాధ్యక్షురాలుగా హెల్దీ భూమవ్వ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పై సీఎం ముఖ్యమంత్రి మాటల్లో మద్దతు నటిస్తూ, చేతుల్లో క్షమించడానికి ద్రోహానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొత్తో ల్ల యాదగిరి, సట్టా గారి లక్ష్మి, బాణాపురం లావణ్య, కాస్త తారీకు శైలేష్, కరీం బాలరాజు తదితరులు పాల్గొన్నారు.