నవతెలంగాణ – కామారెడ్డి
ప్రగతి నగర్ కాలనీని ప్రకృతి నగర్ గా మార్చుకుందామని కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు ప్రగతి నగర్ లో స్వచ్ఛధనం – పచ్చధనం కార్యక్రమంకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ కాలనీ వాసులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియా మాట్లాడుతూ స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజలందరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మొక్కలు మానవ మనుగడకు జీవనాదారం అన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలను నాటాలని అలాగే పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, వాటిని రక్షించాలని సూచించారు, కాలనీలో కుక్కల బేడద ఉందని చెప్పగా కుక్కల బెడద లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. పార్క్ డెవలప్మెంట్ విషయంలో ఎల్లవేళలా కాలనీవాసులకు మా వంతు సహాహ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జూలూరి సుధాకర్, పట్టణ కౌన్సిలర్లు పాత శివ కృష్ణమూర్తి, వనిత రామ్మోహన్, చాట్ల వంశీ, ప్రగతి నగర్ కాలనీ అధ్యక్షులు ఆకుల ప్రభాకర్, ఉపాధ్యక్షులు వడ్ల రమేష్, కోశాధికారి గురజాల వినోద్ కుమార్ రెడ్డి కాలనీవాసులు పాల్గొన్నారు.