సింహ గర్జన సభ విజయవంతం చేద్దాం

– మున్నూరు కాపు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, పార్టీల నాయకుల పిలుపు
నవతెలంగాణ మద్నూర్
ఈనెల 21న బిచ్కుంద మండల కేంద్రంలోని బండయప్ప ఫంక్షన్ హాల్ లో నిర్వహించే జుక్కల్ నియోజకవర్గం స్థాయి మున్నూరు కాపు ల సింహ గర్జన సభ విజయవంతం చేద్దామని ఆల్ పార్టీలకు చెందిన మున్నూరు కాపుల నాయకులు పిలుపునిచ్చారు బుధవారం నాడు మద్నూర్ మండల కేంద్రంలో గల మున్నూరు కాపు సంఘం భవనంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు ధరాస్ సురేష్, ఆత్మ కమిటీ చైర్మన్ కొండ గంగాధర్, మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాకల్ వార్ విజయ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గము స్థాయి నాయకులు గంపల గంగాధర్, బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణ పటేల్ యూత్ నాయకులు తెప్ప తుకారం యువ నాయకుడు గడ్డి తుకారాం పాల్గొని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సింహగర్జన పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆల్ పార్టీల నాయకులు మాట్లాడుతూ మున్నూరు కాపులు ఐక్యమత్యంగా ముందుకు సాగడానికి పార్టీలో కచ్చితంగా సంఘాన్ని అభివృద్ధి పరుస్తూ డిమాండ్ల సాధనకు మున్నూరు కాపులమంతా పార్టీలకతీతంగా పోరాడుదాం అని పిలుపునిచ్చారు సింహం గర్జన సభ విజయవంతానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు నడుం బిగించారు సభ విజయవంతం చేయడమే కాకుండా ప్రభుత్వపరంగా మున్నూరు కాపులకు అందవలసిన సంక్షేమ ఫలాలు సాధించుకుందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం గ్రామ అధ్యక్షులు డాక్టర్ బండి వార్ విజయ్ జనరల్ సెక్రెటరీ సందూర్ వార్ హనుమాన్లు కోశాధికారి థైదల్వార్ చందర్ తదితరులు పాల్గొన్నారు.