బాన్సువాడ పట్టణ కేంద్రంలో సిఐటియు కార్యాలయంలో ఆశ వర్కర్ల సమస్యలపై విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జే రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈనెల 21 నా 10 కిలోమీటర్లు పాదయాత్రతో కలెక్టర్ కార్యాలయం వరకు ఉంటుందనీ, కామారెడ్డి జిల్లాలోని 22 మండలాల్లో ఉన్న ఆశ వర్కర్ లందరూ ఈ కార్యక్రమానికి తరలి రావాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, ఫిక్స్డ్ వేతనం 18000 ఇవ్వాలనీ, ఉద్యోగ భద్రత కల్పించాలనీ, పీఎఫ్, ఈఎస్ఐ తదితర సౌకర్యాలుల్తో పాటు పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వనీ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆశ వర్కర్స్ బాన్సువాడ నాయకురాలు లావణ్య, రజిత, పద్మ, వరలక్ష్మి, సక్కుబాయి తదితరులు పాల్గొన్నారు.