చలో డైరెక్టరేట్‌ను విజయవంతం చేయాలి

Navatelangana,Telugu News,Telangana,Rangareddy,– అంగన్‌వాడీలు అందరు కదిలి రావాలి
– తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్‌ యూనియన్‌ అధ్యక్షురాలు కవిత పిలుపు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్‌ సమస్యలపై, జీవో నెంబర్‌ 10ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 19న చేపట్టనున్న చలో డైరెక్టరేట్‌ను ముట్టడిని విజయవంతం చేయాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్‌ యూనియన్‌ అధ్యక్షురాలు కవిత పిలుపు నిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన చేశారు. జీవో నెబంర్‌ 10ని రద్దు చేయాలి, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ టీర్లకు రూ.2లక్షలు, హెల్పర్లకు రూ.1లక్షకు పెంచి పెన్షన్‌, వీఆర్‌ఎస్‌ సౌకర్యాలు కల్పిస్తూ జీవో జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.