– ఏఐటీయూసీ నాయకుల పిలుపు
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నెల 26న నిర్వహిం చే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలని ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం జగద్గిరిగుట్ట చివరి బస్టాప్ వద్ద భవన నిర్మాణ కార్మికుల అడ్డ వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. అడ్డ గౌరవ అధ్యక్షులు, సీపీఐ నియోజకవర్గ కార్యద ర్శి ఈ.ఉమామహేష్, ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు వి. హరి నాధరావు, వంగాల శ్రీనివాస్ లతో కలిసి భవన నిర్మాణ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు లేనిదే భవనాలు లేవని కానీ.. ఆ భవనాలు నిర్మించే కార్మికులకు స్వంత ఇండ్లు లేకపో వడం వల్ల అనేక ఇబ్బందులకు పడుతున్నారని అన్నారు. గత 15 సంవత్సరాల క్రితం సీపీఐ,ఏఐటీయూసీ పోరాటాల వల్ల తెచ్చుకున్న సంక్షేమ చట్టలే నేటికి కొనసాగుతున్నాయని పెరిగిన అవసరాల కోసం చట్టాలలో మార్పులు రావాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వ ర్యంలో అనేక పోరాటాలు నిర్వహిస్తున్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కోసం వసూలు చేస్తున్న సెస్ ద్వారా వస్తున్న నిధులను భవన నిర్మాణ కార్మికులకు ఖర్చు చేస్తే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, వైద్యం అందించవచ్చని అన్నారు. ప్రమాదవ శాత్తు మరణించిన కార్మికులకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని, సహజ మరణానికి రూ.5 లక్షలకు పెంచాలని, 58 సంవత్సరాలు పైబడిన వారికి రూ.4 వేల పెన్షన్ ఇవ్వాలని, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. సంబంధిత డిమాండ్‌తో ధర్నా నిర్వహిస్తు న్నామని ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు సామెల్, ముసలయ్య, రవి,ఆశప్ప, యాదగిరి, రాములు, ఆరోగ్యం, వెంకటేష్, యాకయ్య,సైదులు తదితరులు పాల్గొన్నారు.