వంగపల్లి దీక్షను విజయవంతం చేద్దాం

– మారపాక నరేందర్ మాదిగ
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
ఎస్సీ వర్గీకరణ సాధనకై వంగపల్లి శ్రీనివాస్ మాదిగ చేపట్టే దీక్షను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు మారపాక నరేందర్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల ప్రాంగణంలో జూలై 7న హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ దగ్గర చేపట్టే దీక్షకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగలకు ఎస్సీ ఏ.బి.సి.డి వర్గీకరణ ద్వారానే  విద్యా,ఉద్యోగ రంగాల్లో అవకాశాలు లభిస్తాయని అన్నారు. జస్టిస్ రామ చంద్రరాజు కమిషన్ మాదిగ స్థితి గతులను అధ్యయనం చేసి వర్గీకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చింది. తదనంతరం 2000 నుండి 2004 వరకు నాలుగు సంవత్సరాలు వర్గీకరణ అమలు కావడం వల్ల దాదాపుగా ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై రెండు వేల మంది మాదిగలు ఉద్యోగ అవకాశాలు పొందారు.అదేవిధంగా వివిధ కమీషన్ల నివేదికలు ఎస్సీలలో ఉన్నట్టువంటి 59 ఉపకులల్లో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు.వర్గీకరణకు రాజకీయ పార్టీలు అండగా ఉన్న మాదిగలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటూ మభ్యపెడుతున్నారని అన్నారు. మాదిగ జాతికి వర్గీకరణనే ముఖ్యమని జాతికి వర్గీకరణ ఇవ్వకుండా మాదిగ జాతి మన్ననలు పొందలేరని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. కావున ఈనెల 7న  జరిగే దీక్షకు జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి అధిక సంఖ్యలో ఇందిరాపార్క్ తరలి వెళ్ళి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  మొండి కత్తి అశోక్, ఉట్కూరి మోహన్ మాదిగ, హరి మాదిగ, కిరణ్ మాదిగ, కుందూరు శ్రావణ్, రాకేశ్, మహేశ్, రామ్ తదితరులు పాల్గొన్నారు.