
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హెచ్ పి సీఎల్ ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్ల యొక్క వేతనాలను తక్షణమే పెంచాలని ఏఐటీయూసీ ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు అన్నారు.శుక్రవారం హెచ్ పి సిఎల్ ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్ల ఏఐటీయూసీ అనుబంధం తో ఐదవ రోజు సమ్మె లో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రమకు తగ్గ ఫలితం అందడం లేదని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ట్రాన్స్ పోర్ట్ యాజమాన్యం ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులకు వారి కడుపు మంట ట్రాన్స్పోర్ట్ యజమానికి అర్థం కావడం లేదని వారి ఓపిక నశిస్తే జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహించారని ఆయన ఘాటుగా హెచ్పీసీఎల్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాల ఉద్దేశించి విమర్శించారు. రాత్రి ఇంకా పగలనక ఊడిగం చేస్తున్న డ్రైవర్ల వేతనాలు పెంచడంలో యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వాయిస్తుందని కనీసం శాంతియుతంగాసమ్మె చేసే హక్కు లేదని నిరసన తెలపడానికి వీలులేదని దౌర్జన్యానికి పాల్పడుతున్న యాజమాన్యం చర్యలు ప్రజాతంత్ర వాదులు ఖండించాలని ఆయన అన్నారు జీతభత్యాలను పెంచి ఇతర సమస్యలను పరిష్కరించుకుంటే మిల్టెంట్ పోరాటానికి సిద్ధమవుతావని హాని హెచ్చరించినారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు దంతాల రాంబాబు, హెచ్పీసీఎల్ ట్యాంక్ డ్రైవర్ల అధ్యక్షులు ఎస్కే బాబా కార్యదర్శి నిమ్మల ప్రభాకర్, ఆల్ టాంకర్స్ డ్రైవర్స్ అందరు పాల్గొన్నారు.