నవతెలంగాణ-కొడంగల్
సంక్రాంతి సందర్భంగా కొడంగల్‌లో తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థా యి కబడ్డీ పోటీల్లో విజేతగా కొడంగల్ జట్టు నిలిచింది. కొడంగల్‌లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం తో దాదాపు 40 జట్లు పాల్గొన్నాయి. 3 రోజులుగా జరి గిన కబడ్డీ పోటీలలో ఫైనల్ పోరు రసవత్తరంగా సాగ గా… చివరకు కొడంగల్ జట్టు విజేతగా నిలిచింది. విజేతగా నిలిచిన కొడంగల్ జుట్టుకు రూ.50 వేలు, రన్నర్‌గా కొడంగల్ మండలం ఎరన్‌పల్లి గ్రామానికి చెందిన జట్టు నిలిచింది. రన్నర్‌గా నిలిచిన జట్టుకు రూ. 30వేలు, కిష్టా పూర్ జట్టు మూడో బహుమతి రూ.20 వేలు, నాలుగవ బహుమతి గోల్డెన్ బేకరీ రూ.10 వేల నగదుతో పాటు ట్రోపీలను యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కష్ణంరాజు, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి ఏనుగుల భాస్కర్, కాం గ్రెస్ పట్టణ అధ్యక్షులు నయుం, కాంగ్రెస్ నాయకులు భీమ్ రాజు, ఎస్టీ సెల్ నాయకులు తార్య నాయక్‌లు విజే తలకు బహుమతులు అందించారు. వారు మాట్లాడుతూ.. క్రీడల వల్ల క్రీడాకారుల మధ్య స్నేహ సంబంధాలు మెరు గవుతాయని తెలిపారు. గెలుపోటములు సహజమని, ఓటమి చవిచూసిన వారు గెలుపునకు నాందిగా భావించి స్నేహ పూర్వకంగా స్వీకరించాలన్నారు. గ్రామీణ ప్రాంత యువతకు ఆటలపై ఆసక్తి పెరగడానికి ఇటువంటి క్రీడా పోటీలు ఎంతో అవసరమన్నారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇలాంటి పోటీ నిర్వహిం చడం ప్రశంసనీయమని కొనియాడారు. గెలుపు ఓటములను పరిగణలోకి తీసుకోకుండా క్రీడాకారులు స్ఫూర్తి చాటాలన్నారు. క్రీడలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందన్నారు. మైదానంలో ఆటలాడే సమయంలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు చూపించే చొరవ జీవిత సమస్యలను పరిష్కరించడానికి మార్గంలా పనిచేస్తాయన్నా రు. ఉత్కంఠతను రేపే క్రీడల్లో పాల్గొనడం ద్వారా నిర్ణయాలు వేగవంతం గా తీసుకునే అలవాటుతో పాటు వ్యక్తిత్వం అలవడుతుందన్నారు. జీవి తంలో గెలుపోటములు సహజం క్రీడా స్ఫూర్తి ఉంటేనే జీవితంలో ముం దుకెళ్తామన్నారు.