– భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షుల వనం మహేందర్..
నవతెలంగాణ – వేములవాడ
దళితల ఆత్మగౌరవన్నీ నిలబెట్టడం కోసం ,దళిత మైనార్టీలు హక్కుల రక్షణ కోసం ఉద్యమిద్దాం.. నేటి వరకు బహుజనుల హక్కుల రక్షణ కై పోరాడుతూనే ఉన్నామని తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు వనం మహేందర్ అన్నారు. ఆదివారం భీమ్ ఆర్మీ రాజన్న సిరిసిల్ల జిల్లా అద్యక్షులు దొబ్బల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యములో వేములవాడలో భీమ్ ఆర్మీ 9 వ ఆవిర్భావ దినోత్సవంన్నీ ఘనంగ నిర్వహించారు, దీనికి ముఖ్య అతిథిగా హాజరు అయిన తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు వనం మహేందర్ భీమ్ ఆర్మీ చీప్ చంద్ర శేఖర్ ఆజాద్ నాయకత్వాన తెలంగాణ రాష్ట్రములో దళిత బహుజన గిరిజన, ముస్లిం మైనార్టీ హక్కుల రక్షణ కోసం ఉద్యమిద్దాం అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వనం మహేందర్ మాట్లాడుతూ.. 2015 జులై 21 న న్యాయ కళాశాలలో దళిత విద్యార్థుల పట్ల అగ్రవర్ణ కుల విద్యార్థులు అవలంభిస్తున్న తీరును చూసి ఆ కుల వివక్షకు వ్యతిరేకంగా వారికి ఎదురొడ్డి పోరాడిన నాటి న్యాయ విద్యార్థులు చంద్ర శేఖర్ ఆజాద్, వినయ్ రతన్ సింగ్, సతీష్ కుమార్ లు కలిసి నడు భీమ్ ఆర్మీ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. నటి నుండి దళితల ఆత్మగౌరవన్నీ నిలబెట్టడం కోసం, దళిత మైనార్టీలు హక్కుల రక్షణ కోసం నేటి వరకు ఉద్యమిస్తూ అనేక పోరాటాలకు పిలుపునిచ్చి, అనేక విజయాలు సాధించిన చరిత్ర భీమ్ ఆర్మీకి ఉందని అన్నారు.
స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా దళిత బహుజన మైనార్టీలు సామాజిక, ఆర్థిక,రాజకీయా అణిచివేతకు గురివుతున్నారని, దిని అంతటికీ రాజ్యాధికారం చేతిలో లేక పోవటమే కారణం అని, రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తే తప్ప ఈ అణిచివేతకు అరికట్టలేము అని,భీమ్ ఆర్మీ నిరంతరం ప్రజ పోరాటాలు చేస్తూ ఎస్సీ, ఎస్టీ ,బీసీ మైనార్టీలను రాజ్యాధికారాన్ని అందించే దిశగా ఉద్యమిస్తోంది అని అన్నారు. భీమ్ ఆర్మీ ఉద్యమాల్లో విద్యార్థీ యువకులు ,మేధావులు బడుగు బలహీనర్గాల వారంతా బాగాసమ్యూలు కవలిని పిలుపునిచ్చారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్, అలాగే వినయ్ రథన్ సింగ్ అదేశల మేరకు భీమ్ అర్మీ అనుబంధ పార్టీ అయిన ఆజాద్ సమాజ్ పార్టీ ( కన్షిరం) సభ్యత కార్యక్రమం నీ రాష్ట్ర లో మెదటి సరిగా సిరిసిల్ల జిల్లా కేంద్రం లో ప్రారంభించడం జరిగిందీ అన్నారు.రానున్న రోజుల్లో ఆజాద్ సమాజ్ పార్టీ అన్ని ఎన్నికలో పోటీ చేస్తుంది అని తెలిపారు.విధి పోరాటాల నుండి నేడు పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయిన చంద్ర శేఖర్ ఆజాద్ భారత రాజ్యాంగంన్నీ రక్షించే దిశగా బహుజనుల గొంతుకై బహుజనుల పక్షాన ప్రశ్నినీస్తాడని అన్నారు.ఈ కార్యక్రమం లో భీమ్ ఆర్మీ నాయకులు మంకలి నవీన్,అక్కనపెళ్లి శేఖర్, జింక శ్రీధర్, నిషాలు,రాంజీ, దినేష్, ప్రదీప్, అరుణ్, సాగర్,రాజు,మహిపాల్, ప్రకాశ్, తదితరుల పాల్గోన్నారు.