కామ్రేడ్ యాదగిరి వేసిన బాటలో ముందుకు నడుద్దాం..

నవతెలంగాణ – ఆర్మూర్
కామ్రేడ్ యాదగిరి అన్న వేసిన బాటల్లో ముందుకు నడుద్దాం అని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి దేవారం అన్నారు. పట్టణ కేంద్రంలో కుమార్ నారాయణ భవన్ లో గురువారం సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ యాదగిరి జిల్లాలో విప్లవోధ్యమ నిర్మాణంకు పునాదులు వేసిన మూల స్థంభంలాంటి వాడని అన్నారు. అనేక మంది కార్యకర్తలను తీర్చిదిద్ది అందరికి ఆదర్శంగా నిలిచాడు అన్నారు. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లోని అన్ని మండలాలలో పెత్తందారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలను కదిలించి పోరాటం చేయించారని అన్నారు. అదేవిధంగా గ్రామాలలో జీతాల పెంపుదల కొరకు కూలీరెట్ల పెంపుదల కొరకు ఒకేసారి వందల గ్రామాలలో పిలుపు ఇచ్చి విజయం సాధించారని అన్నారు రెండు గ్లాసుల పద్ధతికి వ్యతిరేకంగా కుల వివక్షకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్ని చైతన్యం చేశారని అన్నారు,, ఈ కార్యక్రమానికి సిపిఐ ఎంఎల్ ప్రజాపoథా మాస్ లైన్ సబ్ డివిజన్ కార్యదర్శి బి.కిషన్ అధ్యక్షత వహించడం, సబ్ డివిజన్ నాయకులు య౦.ముత్తన్న రాజన్న, టి గంగాధర్, అల్గోట్ సాయిలు, ఇ.రమేష్, జి.పద్మాక్క, సునీత, లక్మి, ప్రజాసంఘాల నాయకులు జి.అరవింద్, నజీర్, రవి, నాగన్న, మెహన్, రాజారాం, గంగాధర్, ప్రభాకర్, గంగాక్క, తదితరులు పాల్గొన్నారు.