– అంజన్న గెలుపు కోసం కృషి చేద్దాం
నవతెలంగాణ-కేశంపేట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చేసిన అభివృద్ధే ఆయుధంగా ముందుకు సాగి అంజన్నను ముచ్చటగా మూడోసారి గెలిపించుకుందామని కేశంపేట ఎంపీపీ వై రవీందర్ యాదవ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని సంగెం గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ షాద్‌నగర్ నియోజకవర్గ అభివద్ధి కోసం ఎంతో కషి చేశారని తెలిపారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలను అందజేసి ప్రజలకు ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. అంజన్న చేసిన అభివద్దే ఆయన గెలుపునకు నాంది పలుకుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలలో అంజన్న గెలుపును ఎవ్వరూ ఆపలేరని, ముచ్చటగా మూడో సారి అంజన్న ఎమ్మెల్యే అవుతారని విజయ సంకేతం పలికారు. కలసి కట్టుగా గెలుపు కోసం కషి చేయాలని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ జగదీష్ గౌడ్, నాయకులు మధుసూదన్ రెడ్డి, బుర్ర వెంకటేష్, వేణుగోపాల్ చారీ, బాలస్వామి, పల్లాటి బాలరాజ్, కుమ్మరి విష్ణు, బుర్ర తిరుమలేష్, పి.యాదగిరి, కష్ణ యాదవ్, పి.జంగయ్య, భగవాన్‌రెడ్డి, బుర్ర యాదగిరి గౌడ్, కుమార్ యాదవ్, కుమ్మరి శ్రీను, గౌస్, గణేష్, మహేందర్, అనిల్, వాహేద్, సలీం, మన్సూర్, యాదగిరి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.