
నవతెలంగాణ – మద్నూర్
ఈనెల 16న బిచ్కుంద మండల కేంద్రంలోని బండయప్ప ఫంక్షన్ హాల్ లో నిర్వహించే జుక్కల్ నియోజకవర్గం స్థాయి మున్నూరు కాపుల మహాసభను విజయవంతం కావడానికి మున్నూరు కాపు సంఘం పిలుపునిచ్చింది. మున్నూరు కాపు మహాసభ విజయవంతం కోసం సంఘ భవనంలో గురువారం సాయంత్రం మున్నూరు కాపు సంఘం సభ్యులంతా ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానిస్తూ మున్నూరు కాపుల సత్తా ఏమిటో చూపిద్దామని ఊరూరా వెళ్లి మున్నూరు కాపులకు ఎకం చేద్దామని, ప్రతి గ్రామం నుండి మున్నూరు కాపులను తరలించి నియోజకవర్గం స్థాయిలో మున్నూరు కాపుల ఐక్యత చాటుదాం అన్నారు, ఈ ప్రత్యేక సమావేశంలో సంఘం నాయకులు డాక్టర్ బండి వార్ విజయ్ పాకల్ వార్ విజయ్ కర్ల సాయిలు థైదల్ చందర్ సందుర్ వార్ హనుమాన్లు తూమ్ రాములు సాతెల సాయిలు గోపన్ శివాజీ తూమ్ గంగాధర్ అంజయ్య సంతోష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.