లింగ వివక్షను వ్యతిరేకించి సమసమాజం స్థాపిద్దాం

నవతెలంగాణ – పెద్దవూర
లింగవివక్షను వ్యతిరేకించి సమ సమాజం స్థాపిద్దామని అనుముల ఐసీఐడీఎస్ ప్రాజెక్టు చలకుర్తి అంగన్వాడీ సూపర్ వైజర్ గౌసియా బేగం
పిలుపునిచ్చారు. గ్రామీణ అభివృద్ధి సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం  చలకుర్తి అంగన్వాడీ 02 వ కేంద్రం లో  ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లింగ వివక్ష అనే ఆలోచన ఉండరాదన్నారు. ఆడ, మగ సమానమేనని అన్న భావన ప్రతి ఒక్కరిలో కలిగించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. మహిళలను గౌరవించే సమాజం ఉన్నతంగా నిలబడుతుందన్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ, తమదైన శైలిలో సత్తా చాటుతున్నారని చెప్పారు. లింగ వివక్షకు సంబంధించి సమాజంలో గణనీయమైన మార్పు రావాలన్నారు. ఆడ,మగ ఇద్దరిని సమానంగా చూచినప్పుడు వారిలో ఎలాంటి లింగ వివక్షను వ్యతిరేకించి సమసమాజం స్థాపిద్దాం అనే భావన ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో లో అంగన్వాడీ టీచర్ శాంతమ్మ, ఆయా పద్మ, ఆశావర్కర్లు, అంగన్వాడీ లబ్ధిదారులు పాల్గొన్నారు.