నిరంకుశ పాలకులను గద్దె దించుదాం

– తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం
– రాంనగర్‌లో పార్టీ హైదరాబాద్‌ ప్లీనరీ
నవతెలంగాణ-ముషీరాబాద్‌
రాష్ట్రంలో నిరంకుశ పాలకులను గద్దె దించి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుదామని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం.నరసయ్య అధ్యక్షతన రాంనగర్‌ ఎస్‌ఆర్‌టీ కమ్యూనిటీ హాల్లో జరిగిన హైదరాబాద్‌ ప్లీనరీ సభలో కోదండరాం మాట్లాడారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తెలంగాణ జన సమితి కీలకంగా మారనున్నదన్నా రు. రాజకీయాల్లో ”మార్పు” కోసం తమ వంతు ప్రయత్నిస్తామని తెలిపారు. నగరంలో అర్హులైన లబ్ధిదారులందరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు వెంటనే పంపిణీ చేయాలనీ, ట్రాఫిక్‌ చలాన్ల నుంచి వాహనదారులను కాపాడాలని కోదండరాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సభ ప్రారంభానికి ముందు రాంనగర్‌ చౌరస్తాలోని అమ రవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనం తరం రామ్‌నగర్‌ చౌరస్తా నుంచి సభా వేదిక వద్దకు కోదండ రాంతో సహా కార్యకర్తలు, నాయకులు పాదయాత్రగా తరలి వెళ్లారు. సభ ప్రారంభానికి ముందు హాలులో కోదండరాం పార్టీ జెండాను ఆవిష్కరించారు. సభలో తెలంగాణ జన సమితి గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రధాన కార్యదర్శి బట్టల రామచందర్‌, ముషీరాబాద్‌ కన్వీనర్‌ మెరుగు శ్రీనివాస్‌ యాదవ్‌, అంబర్‌పేట ఇన్‌చార్జి జస్వంత్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రగిరి సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర నాయకులు లక్ష్మారెడ్డి, రైతు విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌, యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సలీం పాష, విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాసంపల్లి అరుణ్‌ కుమార్‌, మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, నగర యువజన సమితి అధ్యక్షుడు సుశీల్‌ కుమార్‌, మహిళా విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ పుష్పలత, అడిగ్మెట్‌ డివిజన్‌ అధ్యక్షుడు కాకునూరి సుధాకర్‌, నగర సహాయ కార్యదర్శి జయపాల్‌రెడ్డి, గాంధీనగర్‌ డివిజన్‌ అధ్యక్షుడు రవీందర్‌ యాదవ్‌, కవాడిగూడ డివిజన్‌ అధ్యక్షుడు అజరు గౌడ్‌, ముషీరాబాద్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు వెంకటయ్య, నగర నాయకులు లక్ష్మణ్‌, సురేష్‌ నగరంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన నరసయ్య
గ్రేటర్‌ హైదరాబాద్‌ తెలంగాణ జన సమితి అధ్యక్షుడిగా ముషీరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ ఉద్యమకారు డు, జర్నలిస్టు ఎం.నరసయ్య రెండోసారి ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన హైదరాబాదు ప్లీనరీ సభలో కోదండరాం ఆయన నియమకాన్ని వెల్లడించారు. ప్రధాన కార్యదర్శిగా బట్టల రామచందర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మహమ్మద్‌తో పాటు మరో 12 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.