చెట్లను నాటుదాం ప్రకృతిని కాపాడుదాం

నవతెలంగాణ-ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల పరిధిలోని శుక్రవారం కస్తూర్బా గాంధీ బాలికాల విద్యాలయంలో ఏబీవీపీ టీం సభ్యులు బాలికలతో మాట్లాడి అనంతరం “వనమహోత్సవ్” కార్యక్రమాన్ని పాఠశాల స్పెషల్ ఆఫీసర్ మానుపాటి సైదా, విద్యార్థులతో కలసి మొక్కలు నాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప్పునుంతల మండల కార్యదర్శి పాత్కుల మహేష్, సంయుక్త కార్యదర్శి మొగిలి శివ, టీం సభ్యుల అధ్వర్యంలో జరిగినట్లు తెలిపారు.