మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం

– హరితహారంలో మొక్కలు నాటిన ఏఎంసీ చైర్మన్ సంగమేశ్వర్

నవతెలంగాణ – మద్నూర్
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ మద్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్ ప్రజలను కోరారు. హరితహారం పథకంలో భాగంగా శనివారం నాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలో చైర్మన్ వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మార్కెట్ కమిటీ అధికారులు సిబ్బంది కలిసి మొక్కలు నాటి నీళ్ళు పోశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారం పథకాన్ని ప్రారంభించి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.