నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
ప్రతి ఒక్కరికి అవసరమైన ఆక్సిజన్ సరిపడడం లేదని రోజులు రాకూడదంటే మన తక్షణ కర్తవ్యం వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవడం కోసం మొక్కలను నాటి సంరక్షించుకోవడమేనని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మోడల్ స్కూల్ లో వన మహోత్సవం కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరితో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ నీకు ఇష్టమైన వారి పేరు మీద మొక్కను నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలన్నారు. జిల్లాలో 21 లక్షల మొక్కలు నాటుటకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) గరీమ అగర్వాల్, హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న, జిల్లా అటవీశాఖ అధికారి శ్రీనివాస్, హుస్నాబాద్ ఆర్డిఓ రామ్మూర్తి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.