నవతెలంగాణ – కంటేశ్వర్
లక్షలాదిమంది స్వాతంత్ర్య సమర యోధులు, కోట్లాదిమంది భారతీయుల అచంచలమైన పోరాటాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్ర్య ఫలాలను అందరికీ సమానంగా దక్కే వరుకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద, బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం, గిరిరాజ్ కాలేజ్ పక్కన ఉన్న ఫూలే- అంబేడ్కర్ నగర్ లలో జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ బిఎల్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ జెండా ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ ఎందరో మహనీయుల రక్తతర్పణంతో సిద్ధించిన స్వాతంత్ర్యాన్ని అతికొద్దిమంది ఆధిపత్య పెట్టుబడిదారుల కబంధ హస్తాల్లో చిక్కిమగ్గుతున్నదని, తత్ఫలితంగా దేశంలో నిరుద్యోగం,ధరల పెరుగుదల వల్ల సామాన్య ప్రజలు ఆర్థికంగా చితికి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బిసి ఎస్సీ ఎస్టీ, మైనారిటీ అగ్రకుల పేదలైన బహుజన ప్రజలకు రాజ్యాధికారంలో సమాన వాటా దక్కినప్పుడే బహుజనులే పాలకులైప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు వుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత, జిల్లా ఉపాధ్యక్షులు సాయి కాంబ్లే, బి ఎల్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, బి ఎల్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు టి.రాజ్ కుమార్ , అన్నభావు సాఠే మాదిగ సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధర్ గాయక్వాడ్, ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ నాయకులు కేశవ్, కపిల్, ఏజాజ్, బహుజన శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ ఆశా బాయి, నాయకులు జీజాబాయి, స్వాతి, దడ్వాయ సంఘం నాయకులు స్వామి, ఇళ్ల స్థలాల పోరాట కమిటి నాయకులు చంద్రా గౌడ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.