
నవతెలంగాణ-కంటేశ్వర్ : స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 218వ జయంతి సందర్భంగా తెలంగాణ వడ్డెర వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధ్యారంగుల కృష్ణ మాట్లాడుతూ వడ్డే ఓబన్న సుబ్బమ్మల దంపతులకు 1807 జనవరి 11వ తేదీన రాయలసీమలోని రే నాడు ప్రాంతంలో వడ్డెర సంచారతెగకు చెందినవాడు. ఆయన స్వాతంత్ర ఉద్యమ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గుట్టపై బండరాళ్లపై వేస్తున్న పన్నులకు వ్యతిరేకంగా వడ్డరులను ఐక్యం చేసి పోరాటం నిర్వహించారని అన్నాడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రధాన అనుచరుడిగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని తరిమి వేయడానికి పోరాటం చేశాడని అన్నారు.
నేడు వడ్డరుల వృత్తి కనుమరుగైపోతున్న పరిస్థితి వచ్చింది అన్నారు, గుట్టలపై బండరాళ్లపై కార్పొరేట్ కాంట్రాక్టు శక్తులు కన్ను వేసి వడ్డరులను బానిసలుగా తయారు చేశారని అన్నారు, నేడు వడ్డే ఓబన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం మంచి పరిణామం అని, అదే స్ఫూర్తితో వడ్డెరలకు గుట్టపై క్వారీలపై మట్టిపై అధికారం కల్పించాలని డిమాండ్ చేశారు, వడ్డే ఓబన్న స్ఫూర్తితో వడ్డరులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వడ్డెర వృత్తుదారుల సంఘం అధ్యక్షుడు ఇడగొట్టి సాయిలు, పల్లపు వెంకటేష్, బడ్డెన్న, పాపన్న, రమేష్, గంగారం, తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.