– ఐద్వా జిల్లా కార్యదర్శి ఏ. నర్మద
నవ తెలంగాణ – జోగులాంబ గద్వాల
స్వేచ్ఛ, సమానత్వం కోసం, మహిళల హక్కులను కాపాడుకుందామని, మహిళా పోరాటాలకు స్ఫూర్తి అంత ర్జాతీయ మహిళా దినోత్సవం అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఏ. నర్మద అన్నారు. మంగళవారం గద్వాల జిల్లా సెంటర్‌లో సీఐటీయూ కార్యా లయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహి చారు. మార్చి 8 ఈ పేరు వినగానే మహిళలు దోపిడీపై చేసిన అనేక పోరాటాలు , 150 సంవత్సరాల క్రితమే నాటి మహిళలు సాగించిన పోరాటాలు, ఆ పోరా టాలకు నాయకత్వం వహించిన నాయకురాళ్లు, కమ్యూ నిస్టు పార్టీల ప్రోత్సాహంతో అమెరికా యూరప్ జర్మనీ వంటి దేశాల్లో మహిళలు నడిపిన ఉద్యమాలు ఆ ఉద్యమాల్లో అమరులైన వీరవనితలు గుర్తుకు వస్తారని పేర్కొన్నారు. 1908వ సంవత్సరంలో అమెరికా లోని న్యూయార్క్ నగరంలో 15వేల మంది బట్టల మిల్లులో పని చేసే మహి ళా కార్మికులు ప్రదర్శన జరిపారని, ఆ ప్రదర్శన పై ప్రభుత్వ ధమనకాండ తుపాకీ కాల్పుల్లో 146 మంది మహిళలు వీరమరణం పొందారని పేర్కొన్నారు. ఆ తర్వాత కాలంలో జరిగిన ఉద్యమాలు అంతకుముందు జరిగిన పోరాటాలకు స్ఫూర్తిగా 1910లో డెన్మార్క్ నగరంలోని కోపెన్ హెగెన్‌లో జరిగిన రెండవ ఇంటర్నే షనల్ సోషలిస్ట్ మహిళా కాన్ఫరెన్స్‌లో మార్చి 8న అంత ర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల హక్కుల పోరాట రోజుగా నిర్వహించాలని సోషలిస్టు నాయకురాలు క్లారా జ ట్కిన్ అధ్యక్షతన జరిగిన మహాసభ తీర్మానించిందని పేర్కొ న్నారు. నాటి నుంచి అనేక దేశాలు మార్చి 8న మహిళా దినోత్సవం జరుపుకుం టున్నట్లు తెలిపారు.1975లో ఐక్యరాజ్యసమితి కూడా మార్చి 8 మహిళా హక్కుల పోరాట దినోత్సవంగా నిర్వహిం చాలని ప్రకటించినట్లు వివరించారు. నాటినుంచి మనదేశంలో మార్చి 8న అధికారికంగా ప్రభుత్వం నిర్వహి స్తున్నదన్నారు. 2024 మార్చి 8 ని స్త్రీ పురుష సమా నత్వం కోసం పెట్టుబడులు పెట్టాలని ఐక్యరాజ్యసమితి పిలుపు ఇచ్చిందని అన్నారు. 76 సంవత్స రాల ఆజాది అమతరతరతరతరతత మహోత్సవాలు నిర్వహించాలని మన ప్రధాని చెబుతున్నారని, మనువాదం, ఫాసిజం పితస్వామ్య భావజాల ఉక్కు పాదాల కింద స్త్రీ మాన, ప్రాణ అస్తిత్వాలు నలిగిపోతున్నాయని అన్నారు. ఎందులో ఘనత సాధించి నందుకు ఈ అమత మహోత్సవాలు జరపాలని ప్రశ్నిం చారు. తమ సర్వస్వాన్ని త్యాగం చేసి పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్నాం.. మన రాజ్యాంగం కల్పించిన అవకా శాలతో మహిళలు పోరాడి అనేక హక్కులు చట్టాలు సాధించుకున్నారని, 1961 వరకట్న నిషేధ చట్టం, బాల్యవివాహాల నిషేధ చట్టం, సతీసాగమన నిషేధం, గహహింస నిరోధక చట్టం 2005, లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013, ఆస్తిహక్కు 2005, పీఎన్ డీటీ యాక్ట్ 1994 (కడుపులో ఉన్న బిడ్డ ఆడ మగ అని చెప్పడం నేరం), స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు సాధించుకున్నామని తెలిపారు. మహిళా ఉద్యమాల ద్వారా వచ్చిన అవకాశాలు కలిగిన చైతన్యం ద్వారా అనేక రంగాలలో స్త్రీ తన ప్రతిభను చాటుకుంటున్నట్లు పేర్కొ న్నారు. క్రీడల్లో పథకాలు సాధించి ప్రపంచానికి భారతదేశ కీర్తిని చాటారని, శారీరక వైకల్యాలను అధిగమించి వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని అందుకుని స్త్రీ, పురుషులకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించు కుంటున్నారన్నారు. అణచివేత వేధింపులు వివక్షను దాటుకుని మహిళలు అనేక విజయాలు సాధిస్తున్నప్పటికీ సమాజంలో తన గుర్తింపు నేటికీ స్త్రీ రెండవ తరగతి పౌరురాలు గానే ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు మహిళా సాధికారతపై మాట్లాడడమే తప్పా చేసింది ఏమీ లేదని వాపోయారు. గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం స్త్రీలను మరింత వెనుకకు నెట్టే చర్యలు చేపడుతూ స్త్రీలు సాధించుకున్న చట్టాలకు సవరణలు చేస్తూ వాటిని బలహీన పరుస్తున్నది వంటింటికి పూజాగదికి పరిమితం చేసే భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నదని అన్నారు. మార్చి 8 మహిళా దినోత్సవం రో జునే బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహిళలను అణిచివేయాలని మాట్లా డటం తగదన్నారు. ఆడవాళ్లకు హక్కులు ఇస్తే దుర్విని యోగం చేస్తారని , ఆడవాళ్లు హక్కులు అడగొద్దంటున్నారని అన్నారు. ఆడవాళ్లు మాంసాహారం తినవద్దని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ పాలకులు చెబుతున్నారన్నారు. మణిపూర్లో ఇద్దరు మహిళలని నగంగా ఊరేగించి హింసించిన మన ప్రధాని మోడీ నోరు విప్పలేదని, కతువాలో 8 సంవత్స రాల బాలిక అసిఫాను పవిత్ర దేవాలయంలో మత్తు ఇచ్చి వారం రోజులపాటు అత్యాచారం చేసిన దోషులపై కేసు నమోదు చేయడానికి ముందుకు రాలేదని, పైగా ప్రజా సంఘాలు మానవతావాదులు కేసు నమోదు చేయాలని పోరాడుతుంటే బీజేపీ ఎమ్మెల్యేలు కేసు నమోదు చే యవద్దని ర్యాలీలు తీశారని వాపోయారు. హత్రా సుఘ టనలో 19 సంవత్సరాల యువతిని నలుగురు దుర్మార్గులు పొలం నుంచి లాక్కెళ్ళి అతి కిరాతకంగా అత్యా చారం చేశారని, ప్రజా సంఘాల పోరాటంతో ఆ నలుగురిని అరెస్టు చేసినా నేరం యువతీపై మోపే ప్రయత్నం బీజేపీ ప్రభు త్వం చేసిందని ఆరోపించారు. నాలుగు రోజుల తర్వాత మతి చెందిన యువతి మతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు ఇవ్వకుండా వారిని ఇంట్లో బంధించి ఈ విషయాలు బయట చెబితే చంపేస్తామని కలెక్టర్ తో చెప్పించి పోలీసులతో అర్థరాత్రి ఆ యువతి దహన సంస్కారాలు చేయించారన్నారు. ఒకవైపు బేటి బచావో బేటి పడావో అంటూ మహిళా సాధికారతకు అడుగులు వేస్తున్నాం అం టూనే బిల్కీస్ బానో కేసులో అతి కిరాతకులైన దోషులను 11 మందిని దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున విడుదల చేసి బిల్కీస్ భానుకి మహిళలకి రక్షణపై మాట్లాడవద్దని సందేశం ఇచ్చారని, ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు సుభాషిణి అలీతో పాటు అనేక సంఘాలు ప్రజాస్వా మ్యవాదుల పోరాటంతో తిరిగి ఆ నిందితులను జైలుకు పంపించినట్లు వివరించారు. స్త్రీలు వంటింటికీ, పిల్లలు కనడానికి పరిమితం కావాలని చెబుతున్నారన్నారు. మూడు దశాబ్దాలుగా పోరాడుతున్న మహిళా రిజర్వేషన్లు అమలుకు నోచుకోలేదని, మహిళల ఓట్ల కోసం 33శాతం మహిళా రిజర్వేషన్ చట్టం చేసిన ఇప్పుడు అమలు చేయలేమని చెబుతున్నారని, జనగణన నియోజకవర్గాల పునర్విభజన ఈ నిబంధనల వల్ల రాబోయే 10 సంవత్సరాల వరకు రిజర్వేషన్లు అమలు జరిగే అవకాశం లేదని, ధరల నియం త్రణ చేయలేని ప్రభుత్వం పేదరికాన్ని పెంచుతున్నదని వాపోయారు.గత పది సంవత్సరాల్లో మన దేశంలో పేద రికం పెరిగిందని, 140 దేశాలకు గాను మన దేశం స్త్రీల భద్రతలో 126వ స్థానంలో ఉన్నామంటే పరిస్థితి ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చన్నారు. స్త్రీలు అభివద్ధి చెందని ఏ దేశం ముందుకు పోలేదని చరిత్ర చెబుతున్నదని, అందుకే దేశ అభివద్ధికి సమాజంలో సగభాగం ఉన్న స్త్రీలు పునరంకితం అయ్యేందుకు ఈ మార్చి 8 స్ఫూర్తి కావా లన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీ.వీ నరసింహ , నాగ ప్రమీల , పాగుంటమ్మ , శ్రీదేవి , లక్ష్మి, కాంతమ్మ , పద్మ , శశికళ తదితరులు పాల్గొన్నారు.