– 73 శాతం సంపద కార్పొరేట్ల చేతుల్లో..
– కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతున్న మోడీ ప్రభుత్వం
– బానిసత్వం నుంచి ప్రజలను రక్షించగల ఏకైక పార్టీ సీపీఐ(ఎం)
– సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు సోమయ్య
– షాద్‌నగర్‌లో జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు
నవతెలంగాణ-షాద్‌నగర్
కొన్ని పార్టీలు మతాన్ని పెంచి పోషిం చడమే ఎజెండాగా పని చేస్తున్నాయని, మత తత్వ రాజ కీయాలను తిప్పికొట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర నాయకులు సోమయ్య పిలుపుని చ్చారు. షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నందిగామ మండలం ఈదులపల్లి గ్రామం కాక రిసార్ట్‌లో సీపీఐ(ఎం) జిల్లా స్థాయి రాజ కీయ శిక్షణా తరగతులు సోమవారం ప్రారం భం అయ్యాయి. శిక్షణ తరగతులకు ముం దుగా పార్టీ జెండాను జిల్లా కార్యదర్శి వర్గ స భ్యులు బి.సామెల్ ఎగురవేశారు. అనం తరం ఏర్పాటు శిక్షణా తరగతుల్లో రాష్ట్ర నాయకులు సోమయ్య పాల్గొని మాట్లాడారు. రాబోయే రోజుల్లో మతతత్వ రాజకీయానికి వ్యతిరేకం గా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంద న్నారు. మతతత్వ పార్టీలను ప్రోత్సహించకూ డదని తెలిపారు. దేశంలో మతతత్వ శక్తులు రాజకీయ రంగంలో చొరబడుతూ సమాజా న్ని అభివృద్ధి చెందనీయకుండా కుల, మతాల మధ్య చిచ్చుపెడుతూ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని హెచ్చరించారు. అంతేకా కుండా మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నాడని, భారతదేశంలో 73 శా తం ఆస్తి ఒక్క శాతం ఉన్న కార్పొరేట్ శ క్తుల వద్ద ఉందని తెలిపారు. కాబట్టి దేశ సం పద మొత్తం కార్పొరేట్ల చేతుల్లో కేంద్రీకృ తమైందని వివరించారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో బాగుపడిం ది పెట్టుబడు దారులే తప్ప పేదవాడు బాగుపడింది లేదని వాపోయారు. ఆదానీకి సంబంధించిన బ్యాం కు రుణాలను మొత్తం పేదవారిపైన వేసి రు ణాలను మొత్తం మాఫీ చేసిన ఘనత మోడీ ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. పేదవారికి లోన్లు ఇవ్వడానికి ఎంతో ఆలోచించే బ్యాంకులు, ధనవంతులకు లోన్లు ఇవ్వడమే కాకుండా వారి లోన్లు మాఫీ చేస్తూ వారిని దేశం దాటించి బయటికి పంపించే ప్రయత్నాలు ఎన్నో చేశారని వివరించారు. బానిసత్వం నుంచి ప్రజలను విముక్తులను చేసే పార్టీ ఏదైనా ఉంది అంటే అది సీపీఐ(ఎం) పార్టీ మాత్రమే అన్నారు. పార్టీని నడిపించేందుకు ఎంతో మంది తమ జీవితాలను పణంగా పెట్టారని గుర్తు చేశారు. భారత పాలక వర్గాల పార్టీల ను ఎదుర్కొని నిలబడే ఏకైక పార్టీ సీపీఐ(ఎం) అని కొని యాడారు. ఒక వ్యక్తి పార్టీలో సభ్యత్వం పొందాలంటే సంవత్సరం పార్టీ కోసం పని చేయాలని, సంవత్సర కాలంలో పా ర్టీకి సంబంధించిన అనేక విషయాలలో తర్ఫీ దు పొందాలని అన్నారు. పూర్తిగా సభ్యత్వం పొందాలంటే పార్టీలో ఉన్న వారిలో ఇద్దరి సా క్షుల సంతకాలు పెట్టడం వలన పార్టీ పూర్తి కార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశం ఉం టుందని అన్నారు. పెట్టుబడి దారి వర్గం నుం చి శ్రామిక వర్గాన్ని రక్షించాలంటే, అంతేకా కుండా కుల, మత తారతమ్యాలు లేకుండా ప్రజలు జీవించాలంటే పార్టీ బలపడాలని అన్నారు. మతం, కులం లేని ఏకైక పార్టీ తమదేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.రాజు, చంద్రమో హన్, జగదీష్, పగడాల యాదయ్య, శోభన్, కవిత, నర్సిరెడ్డి, అంజయ్య, శ్రీనునాయక్, ఈ శ్వర్, కుర్మయ్య, వెంకటరమణ, మహమ్మద్, బాబు, లక్ష్మి, శంకర్, రాజు, జగన్, ప్రణరు, చరణ్, తదితరులు పాల్గొన్నారు.