క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుందాం!

-కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం!
సీఐటీయూ  రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ రమ
నవతెలంగాణ – కంటేశ్వర్
గుడ్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుందాం కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం అని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ రమ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం సీఐటీయూ కార్యాలయంలో సిఐటియు జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎస్వీ రమ  హాజరయ్యారు. ఈ సందర్భంగా  మహా పడవు ఆగస్టు 9 10 న జరిగే కరపత్రాలు విడుదల చేయడం జరిగింది . ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ రమ గారు మాట్లాడుతూ. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కార్పొరేట్ అనుకూల కేంద్ర బిజెపి ప్రభుత్వం బరితెగించి అమలు చేస్తుంది ప్రజా, కార్మిక వ్యతిరేక పరిపాలన | సాగిస్తున్నది. జాతీయ సహజ వనరులు, ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా స్వదేశీ, విదేశీ కార్పోరేట్లకు అమ్మేస్తున్నది. డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచింది. పార్లమెంట్లో మూడు రైతాంగ | వ్యతిరేక చట్టాలను నిరంకుశంగా ఆమోదించుకున్నప్పటికీ కార్మిక, కర్షక ఉద్యమంతో ఆ చట్టాలను ఉపసంహరించుకున్నది. అయినా 2015లో నరేంద్ర మోడీ పార్లమెంట్లో ఇచ్చిన కనీస మద్దతు ధర హామీ నేటికీ అమలు కాలేదు. 2023-24 కేంద్రం | బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి, ఆహార ఉత్పత్తులకు సబ్సిడీలకు భారీగా కోతలు విధించింది. జిడిపిలో విద్యా రంగానికి 6 శాతం, వైద్య రంగానికి 2 శాతం కేటాయించకుండా నిర్లక్ష్యం చేసింది. ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలపై ఉక్కుపాదం మోపింది. పౌరుల ప్రాథమిక హక్కులను పాతరేస్తున్నది. ఉపాధి, | నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి, అసమానతలు, ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలను జటిలం చేస్తున్నది. ఈ నేపథ్యంలో 9 ఏళ్ళ మోడీ ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిల భారత కార్మిక సంఘాల పిలుపులో భాగంగా క్విట్ ఇండియా డే ప్రచార క్యాంపెయిన్ను ఆగస్టు 9, 10 తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో ఆగస్టు 9న కొత్త కలెక్టర్ కార్యాలయం వద్ద ఆగస్టు 10న లేబర్ కార్యాలయం వద్ద ఉంటుంది మహాధర్నా | కార్యక్రమాలు విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మికవర్గానికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్ నూర్జహాన్, జిల్లా ఉపాధ్యక్షులు ఈవీఎల్ నారాయణ గోవర్ధన్ జంగం గంగాధర్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కటారి రాములు సాగర్ రేణుక, నరసయ్య, రాజేశ్వర్ పద్మ, తదితరులు పాల్గొన్నారు.